కేటీఆర్ దెబ్బ‌తో డ‌మ్మీ అయిన గ్రేట‌ర్ మేయ‌ర్‌..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మేయ‌ర్‌గా డ‌మ్మీ అయిపోయాడా ? గ్రేట‌ర్‌కు పేరుకు మాత్ర‌మే ఆయ‌న మేయ‌రా ? ఇక్క‌డ వ్య‌వ‌హారాల‌న్ని తెర‌వెన‌క తెర ముందు కేటీఆర్ చక్క‌పెట్టేస్తుండ‌డంతో రామ్మోహ‌న్‌కు ఇబ్బందిగా మారిందా ? అంటే గ్రేట‌ర్‌లో ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. వాస్త‌వానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ+బీజేపీ కూట‌మి స‌త్తా చాటింది. త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. గ్రేట‌ర్లో గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం కేసీఆర్ త‌న త‌న‌యుడు కేటీఆర్‌కు అప్ప‌గించారు. కేటీఆర్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం ఆరు నెల‌ల పాటు గ్రేట‌ర్‌లో గ‌ల్లీ గ‌ల్లీ తిరిగారు. గ్రేట‌ర్‌ను విశ్వ‌న‌గ‌రంగా మారుస్తామ‌ని ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయ‌నపై విశ్వాసం ఉంచిన గ్రేట‌ర్ ప్ర‌జ‌లు గ్రేట‌ర్లో టీఆర్ఎస్‌కు తిరుగులేని మెజార్టీ క‌ట్ట‌బెట్టారు.

మొత్తం 150 వార్డుల‌కు ఇక్క‌డ టీఆర్ఎస్ ఏకంగా 99 సీట్లు గెలుచుకుంది. బొంతు రామ్మోహ‌న్ గ్రేట‌ర్ మేయ‌ర్ అయ్యారు. పేరుకే ఆయ‌న మేయ‌ర్‌. కానీ ఇక్క‌డ ప్ర‌భుత్వ ప‌రంగాను, పార్టీ ప‌రంగాను మంత్రి కేటీఆర్ వ‌న్ మ్యాన్ షో న‌డుస్తోంది. ఇక కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్‌లోని కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.అందుకే ఆయ‌న ఇక్క‌డే మెయిన్‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇక్క‌డ మంత్రి కేటీఆర్ దూకుడుతో మేయ‌ర్ రామ్మోహ‌న్ డ‌మ్మీ అయ్యార‌నే చ‌ర్చ‌లే అటు టీఆర్ఎస్‌లోను ఇటు బ‌ల్దియా నాయ‌కుల్లోను వినిపిస్తున్నాయి. వ‌ర్షాలు ప‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డితే ఆ ఫోక‌స్ కేటీఆర్‌పై త‌క్కువ‌గాను మేయ‌ర్‌పై ఎక్కువ‌గాను ఉంటోంది. మీడియా అంతా మేయ‌ర్‌నే ఎక్కువుగా టార్గెట్‌గా చేసుకుని ఏకేస్తోంది. దీంతో రామ్మోహ‌న్ అధికారాల‌న్ని కేటీఆర్ ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని, గ్రేట‌ర్ అధికారులు సైతం ఆయ‌నే మాటే వింటున్నార‌ని..అలాంట‌ప్పుడు తాను ఎలా నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌ను, ఎలా స్వ‌తంత్య్రంగా ప‌ని చేస్తాన‌ని మేయ‌ర్ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌.

క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డికి మేయ‌ర్ ఏదైనా ప‌ని చెప్పినా లైట్ తీస్కొని కేటీఆర్ చెప్పే వ‌ర‌కు గాని దానిని అమ‌లు చేయ‌డం లేద‌ట‌. ఏదేమైనా తేడా వ‌స్తే త‌న మేయ‌ర్ ప‌ద‌వికి ఎక్క‌డ ఎర్త్ పెడ‌తారా ? అని క‌క్క‌లేక మింగ‌లేక అన్న చందంగా మేయ‌ర్ ఉన్నార‌ట‌.