ఎయిడ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదే !

July 17, 2018 at 4:15 pm

ప్రపంచంలో ఎయిడ్స్ ఎంత భయంకరమైన వ్యాధి అనేది అందరికీ తెలిసిందే.  ఎయిడ్స్ భారిన పడిన వారు ఇప్పటి వరకు కోలుకోలేదు.  అయితే ప్రపంచం ఇంత టెక్నాలజీ రంగం వైపు మళ్లుతున్నా..ఎంతటి మొండి వ్యాధులకు మందులు కనిపెడుతున్నా..ఎయిడ్స్ కి మాత్రం సరైనా యాంటిబయటిక్ కనిపెట్టలేక పోతున్నారు.  ఎయిడ్స్ కి నివారణ మనిషి తనను తాను రక్షించుకోవాల్సిన సూచనలు పాటించడమే.  అయితే ఇప్పుడు ఎయిడ్స్ కన్నా మరో భయంకరమైన వ్యాధి గురించి ప్రపంచ శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. condom-in-pocket.jpg.838x0_q67_crop-smart

 

మైకోప్లాస్మా జెనిటాలియం (ఎంజీ) అనే సుఖవ్యాధి మందులకు లొంగని సూపర్ బగ్ కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.  ఎంజీ వ్యాధిని గుర్తించడానికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ దీని వల్ల కటిభాగంలో పుళ్లు ఏర్పడవచ్చచు. మహిళల్లో పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం ఉంది.  ఎంజీని సరైన సమయంలో గుర్తించి దానికి చికిత్స చేయకుంటే.. అది ముందు ముందు యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగకుండా పోతుంది.  అయితే ఇది ఎయిడ్స్ కన్నా ప్రమాదమే అయినా కొన్ని నివారణోపాయలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.   ఈ నేపథ్యంలో ‘బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ హెచ్‌ఐవీ’ ఎంజీని ఎలా గుర్తించాలి, దానికి ఎలాంటి చికిత్స చేయాలన్న దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

 

అసలు ఎంజీ అంటే ఏమిటి?

మైకోప్లాస్మా జెనిటాలియం అనేది ఒక సూక్ష్మజీవి. ఇది పురుషులలో మూత్ర విసర్జన నాళం వాపునకు కారణమై, మూత్ర విసర్జన బాధాకరంగా అయ్యేలా చేస్తుంది. ఎంజీని మొదట బ్రిటన్‌లో 1980లలో గుర్తించారు.  ఎంజీ ఉన్నా అన్నిసార్లూ దాని లక్షణాలు కనిపించవు. దానికి అన్నిసార్లూ చికిత్స కూడా అవసరం లేదు. కొన్నిసార్లు దీనిని క్లామైడియా అనే మరో సుఖవ్యాధిగా కూడా పొరబడే అవకాశం ఉంది.  

 

మహిళల విషయానికి వస్తే, వారిలో పునరుత్పాదక అంగాలు (గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్) వాయడానికి కారణమవుతుంది. దీని వల్ల జ్వరంతో పాటు విపరీతమైన బాధ, కొంత రక్తస్త్రావం కూడా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారితో కండోమ్స్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే ఇది వాళ్లకు కూడా అంటుకునే ప్రమాదముంది. కొన్నిసార్లు దీనిని క్లామైడియా అనే మరో సుఖవ్యాధిగా కూడా పొరబడే అవకాశం ఉంది. ఇటీవలే ఈ వ్యాధికి పరీక్షలు కనుగొన్నా, ప్రస్తుతం ఇవి అన్నిచోట్లా అందుబాటులో లేవు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న ప్యాడీ హార్నర్, ”పిల్లలు పుట్టని మహిళలు తప్పకుండా వెంటనే ఈ ఎంజీ పరీక్షలు చేయించుకోని తగిన ట్రీట్ మెంట్ చేసుకోవాలని అంటున్నారు. 

 

ప్రస్తుతం యాంటీబయాటిక్స్‌తో ఎంజీకి చికిత్స చేయొచ్చు. కానీ ఇది క్రమక్రమంగా కొన్ని యాంటీబయాటిక్స్‌కు లొంగకుండా పోతోంది.  ఉదాహరణకు బ్రిటన్‌లో ఎంజీ చికిత్సలో ఉపయోగించే మాక్రోలైడ్స్ అనే యాంటీబయాటిక్స్‌కు 40 శాతం పని చేయడం తగ్గిపోయిందని పరిశోధనల్లో తేలడం ఆందోళన కలిగిస్తోంది.dontforgetcondom-641745 

ఎయిడ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇదే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share