పెరుగుతున్న సాంకేతిక‌త‌.. త‌రుగుతున్న బంధాలు!

February 22, 2018 at 5:13 pm

సంసారం ఒక చ‌ద‌రంగం- అంటూ కుటుంబాల్లోని వ్య‌క్తులు అసూయ‌, ద్వేషాల‌తో ర‌గిలిపోతూ.. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌, ఒక‌రిపై ఒక‌రు చాడీలు చెప్పుకుని, అక్క‌సు పెంచుకుని చ‌క్క‌టి సంసారాల‌ను కూల‌దోసుకున్న చ‌రిత్ర‌ల‌ను చూసి.. అయ్యో పాపం అనుకున్నాం. అలాంటి వారిని, అలాంటి సంసారాల‌ను క‌ల‌సి క‌ట్టుగా నిల‌బెట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు సాగాయి. ఫ్యామిలీ కోర్టులు సైతం వ‌చ్చాయి. భార్య‌ను భ‌ర్త‌ను, పిన్న‌ల‌ను, పెద్ద‌ల‌ను ఏకం చేశాయి. అయితే, ఇప్ప‌డు సీన్ మారింది! సంసారానికి సాంకేతిక‌త శ‌త్రువులా మారిపోయింది!! ఈ దేశాన్ని సాంకేతిక‌త న‌డిపిస్తుంద‌ని, సాంకేతిక‌త ద్వారా మ‌నిషి.. స్వాప్నిక లోకంలో స్వ‌ర్గ తుల్య‌మైన సౌక‌ర్యాలు అందుకుంటాడ‌ని భావించి అధునాత‌న సాంకేతిక‌త‌ను చేరువ చేసుకున్నాం. 

jhqvf

 

అప్పుచేసి ప‌ప్పు కూడు అని ఆరోజుల్లో అన్నారు. కానీ, నేడు అప్పుచేసైనా.. అర‌చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంచుకోవాలంటోంది నేటి త‌రం! అంతేకాదు, స్మార్ట్ ఫోన్‌తో స్వాప్నిక లోకంలో విహ‌రించాల్సిందేన‌ని ఘంటా ప‌థంగా చాటుతోంది. అందుకే స్మార్ట్ లేని లైఫూ.. ఓ లైఫేనా అన్న‌ట్టుగా త‌యార‌య్యారు మ‌నుషులు. లెక్క‌కు మిక్కిలి కంపెనీలు ఫోన్ల వ‌ర‌ద పారిస్తుంటే.. వాటి వెంటే అప్పులిస్తామంటూ.. వెంట‌బ‌డుతున్న కంపెనీల‌కు  కొద‌వే లేకుండా పోతోంది. అర‌చేతిలో అద్భుత ప్ర‌పంచాన్ని వీక్షించేందుకు అప్పుచేయ‌డాన్ని త‌ప్పుగా భావించ‌డం లేదు స‌రిక‌దా.. ప్రెస్టేజ్‌గా ఫీల‌వుతున్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు స్మార్టు ఫోన్లు వినియోగిస్తున్న దేశాల జాబితాలో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ని  తేలింది. 

 

సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డాన్ని, అధునాతన రీతిలో విజ్ఞానాన్ని స‌ముపార్జించుకోవ‌డాన్నీ.. ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఇది కావాల్సిందే కూడా. అయితే, అనుకున్న విధంగా సాంకేతిక విధానంలో మ‌నం ముందుకు పోతున్నామా? అనేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్నార్థ‌క‌మైన అంశంగా మిగిలిపోయింది. సంసారాల్లోకి ప్ర‌వేశించిన సాంకేతిక‌త‌.. భావ విప్ల‌వం తేవ‌డానికి బ‌దులు.. అవినాభావ విప్ల‌వం తేవ‌డం అంత‌టా విస్తుగొలుపుతోంది. తెల్ల‌వారింది మొద‌లు.. నిద్ర‌కు ఉప‌క్ర‌మించే వ‌ర‌కు సెల్‌లో సంధాన‌మై పోతున్న బ్ర‌తుకులకు.. భూత‌.. భ‌విష్య‌త్తులు రెండూ స్మార్ట్ ఫోన్లే కావ‌డం అందిర‌నీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. వాట్స‌ప్‌లు, ఫేస్ బుక్‌లు, ఈమెయిళ్లు, ట్విట్ట‌ర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇలా ఒక‌టేమిటి.. స‌మ‌స్త సాంకేతిక‌తా మాన‌వాళి.. అర‌చేతిలో ఇమిడిపోయింది. 

cheating-spouses-toronto-big

 

అయితే, ఇది మాన‌వ మ‌నుగ‌డ‌పై ప్ర‌భావం చూప‌డం పోయి.. ప్ర‌మాదం చూపుతుండ‌డమే ఇప్పుడు దేశానికి ప్ర‌ధాన స‌వాలుగా ప‌రిణ‌మించింది. భార్య‌కు భ‌ర్త‌కు మ‌ధ్య ఏకాంతం దూర‌మై.. చాలా కాల‌మే అయిపోయింది!  ఈ ఏకాంతాన్ని దోచేసింది అచ్చంగా స్మార్టు ఫోన్‌లేన‌ని అధ్య‌య‌నాలు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నాయి. ఇద్ద‌రూ సంపాయిస్తే కానీ గ‌డ‌వ‌ని ప్ర‌స్తుత ప్ర‌పంచంలో ల‌భించే కొద్దిపాటి విరామ స‌మ‌యాన్ని కూడా స్మార్టు ఫోన్లు మింగేస్తుండ‌డంతో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఉండాల్సిన ఆ సంబంధం సైతం అట‌కెక్కుతోంది. ఫ‌లితంగా ఎవ‌రికి న‌చ్చిన వారిని వారు వెతుక్కునే ప‌నిలో నిమ‌గ్న‌మవుతున్నారు. ఫ‌లితంగా నీకు నువ్వే-నాకు నేనే అనే సంస్కృతి ప్ర‌బ‌లి.. భార‌తీయం బావురుమంటోంది. స్మార్టు తెచ్చిన చిచ్చుతో సంసారం న‌లిగిపోతోంది. ఈ ప‌రిణామం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు దారి క‌నిపించ‌క‌.. స‌త‌మ‌త‌మ‌వుతోంది. 

 

పెరుగుతున్న సాంకేతిక‌త‌.. త‌రుగుతున్న బంధాలు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share