హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్ల‌కు ఛాన్స్ ఇచ్చిన హీరో

ఏ రంగంలో అయినా స‌క్సెస్ వారి కెరీర్‌కు కొల‌మానంగా నిలుస్తుంది. రాజ‌కీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ వాళ్ల వెంట‌నే జ‌నాలు ప‌రిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెన‌క చూస్తుంటాడు. అలాంటిది ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడు బంప‌ర్ ప్లాపులు ఇచ్చిన ఓ ద‌ర్శ‌కుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడ‌న్న వార్త‌లే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

టాలీవుడ్‌లో శ్రీను వైట్ల అంటే ఒక‌ప్పుడు పెద్ద హీరోలంద‌రూ అత‌డి చుట్టూనే తిరిగేవారు. ఆగ‌డు – బ్రూస్‌లీ – ఈ స‌మ్మ‌ర్‌లో మిస్ట‌ర్ ఈ మూడు ఒక‌దానిని మించిన మ‌రొక డిజాస్ట‌ర్ సినిమాలు అయ్యాయి. దీంతో ఇప్పుడు శ్రీను వైట్ల‌ను ప‌ట్టించుకునే తీరిక ఏ హీరోకు లేదు. అస‌లు ఇండ‌స్ట్రీ శ్రీను వైట్ల‌ను గుర్తుంచుకుంటుందా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తోన్న వేళ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ శ్రీను వైట్ల‌కు ఛాన్స్ ఇచ్చాడ‌న్న గుస‌గుస‌లు ఇక్క‌డ జోరుగా వినిపిస్తున్నాయి.

రామ్ ఇటీవ‌ల త‌న‌కు గ‌తంలో కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు హైప‌ర్‌తో ఛాన్స్ ఇచ్చాడు. అంత‌కు ముందు సంతోష్ ర‌భ‌స లాంటి డిజాస్ట‌ర్‌తో క‌ష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు అదే రూట్లో గ‌తంలో త‌న‌కు రెడీ లాంటి హిట్ ఇచ్చిన వైట్ల‌పై న‌మ్మ‌కంతో మ‌రో ఛాన్స్ ఇస్తున్నాడ‌ని స‌మాచారం. మ‌రి ఈ ఛాన్స్ అయినా శ్రీను వైట్ల ఎంత వ‌ర‌కు నిల‌బెట్టుకుంటాడో చూడాలి.