హీరోయిన్ సీక్రెట్ పెళ్లి .. సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు

July 15, 2017 at 10:19 am
add_text666

సౌత్ ఇండ‌స్ట్రీలో గ‌త నాలుగైదు రోజులుగా ఏదో ఒక వార్త సెన్షేష‌న‌ల్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ప్ర‌ముఖ హీరోయిన్ భావ‌న‌పై లైంగీక దాడి కేసులో మ‌ళ‌యాళ హీరో దిలీప్‌ను అరెస్టు చేయ‌డం, ఇక టాలీవుడ్ డ్ర‌గ్ ఇష్యూలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగాయి. ఈ రెండు ఇష్యూలు సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేశాయి.

ఈ రెండు వార్త‌లు ఇంకా మీడియాలో న‌లుగుతుండ‌గానే ఇప్పుడు శాండ‌ల్‌వుడ్ వంతు వ‌చ్చింది. శాండ‌ల్‌వుడ్‌లో ఓ హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంద‌న్న వార్త‌లు సంచ‌ల‌నంగా మారాయి. శాండల్‌వుడ్‌ నటి రమ్య‌ బార్నా రహస్యంగా వివాహం చేసుకున్నట్లు మీడియాలో ప్రచారం కావడంతో ఇండస్ట్రిలో చర్చనీయాంశమైంది. 

పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రమ్య‌ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ర‌మ్య  మే 29న  జేడీఎస్‌ బహిష్కృత ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ బంధువైన వ్యాపారవేత్త ఫహాద్‌ ఆలీఖాన్‌ను శివాజీనగర్‌లో ఉన్న రిజిస్టార్‌ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహంపై పూర్తి స్థాయి వార్త తెలియాల్సి ఉంది.

హీరోయిన్ సీక్రెట్ పెళ్లి .. సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు
0 votes, 0.00 avg. rating (0% score)

comments