ప‌వ‌న్ విషయంలో జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌

ప్ర‌త్య‌ర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమ‌లుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విష‌యాలు రాజ‌కీయాల్లో నిరంత‌రం ప‌రిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే ప‌నిలో ప‌డ్డార‌ట ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌! ఇంత‌కీ ఆయ‌న ఆరా తీస్తున్న‌ది ఎవ‌రి గురించో తెలుసా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి! సీఎం చంద్ర‌బాబు గురించి ఆలోచించ‌డం మాని.. ప‌వ‌న్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉంద‌ట‌. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ‌ల్లే తాను అధికారంలోకి దూర‌మ‌య్యాన‌ని జ‌గ‌న్ బ‌లంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఈసారి 2019లో ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

కాట‌మ‌రాయుడిపై జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టిపెడుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన నాటినుంచి ప‌వ‌న్ దూకుడు పెంచాడు. జ‌గ‌న్‌కు ఈసారి కూడా ప‌వ‌న్ అడ్డుప‌డ‌తాడ‌ని విశ్లేష‌కులు భావించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఫుల్ అల‌ర్ట్ అయ్యాడు. పవన్ రాజకీయ కదలికలపై సీక్రెట్ గా ఆరాతీయడం మొదలు పెట్టారట. దీనికి సంబంధించిన గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలో పవన్ ప్రత్యక్షంగా బరిలోకి దిగుతుండడంతో జనసేనాని కదలికలపై ఓ కన్ను వేసి ఉంచితే మంచిదని జగన్ భావిస్తున్నారట.

ఇటీవల కాలం నుంచి జగన్ కదలికలపై వివరాలు తెప్పించుకుని వాటిని పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలో కాటమరాయుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి సంబందించిన ఓ విషయం జగన్ చెవిన పడ్డట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ ఈవెంట్ లో అభిమానులంతా పవన్ ని ఉద్దేశించి సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయడం వాటికి పరోక్షంగా పవన్ స్పందించారు. `మీరు మాట్లాడేవి నాకు వినిపిస్తాయి. మీరు కోరుకునేది జరిగితే జరగొచ్చు లేకుంటే లేదు. జరిగితే మంచింది. జరగకపోతే ఇంకా మంచింది` అని  వ్యాఖ్యానించారు.

ఈ విషయం జగన్ కు తెలియడంతో 2019 లో జనసేన ఏమేరకు ప్రభావం చూపే అవకాశం ఉందొ అని విశ్లేషణలు చేయిస్తున్నాడట. అలాగే టీవీ 9 రవిప్రకాష్.. పవన్ కు బహిరంగంగానే మద్దతు తెలపడం అంశం కూడా జగన్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓసారి 2014 ఎన్నికల్లో పవన్ వల్ల వైసిపి దెబ్బతినింది. దీనితో రెండవసారి అలాంటిది రిపీట్ కాకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి వీట‌న్నింటినీ జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తాడో ఏంటో!!