‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో హిట్ – ఫ‌ట్ లెక్క‌లివే

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోల సంద‌డితో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు ఎక్క‌డిక‌క్క‌డ థియేట‌ర్ల వ‌ద్ద పోటెత్తారు. ఇక ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత సినిమాకు హిట్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతోంది.

సినిమాలో హిట్‌ల లెక్క‌కు వ‌స్తే జై పాత్ర ప్ర‌ధాన హైలెట్‌. జై పాత్ర టీజర్ బయటికి రాగానే మొత్తం దృష్టి ఆ క్యారెక్ట‌ర్ మీదే ఉంది. అంచ‌నాల‌కు మించేలా జై పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. జై పాత్ర అనుకుంటే లవకుశ పాత్రలు బోనస్. ఎక్కడా ఒక దానికి ఒకటి సంబంధం లేని మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక కొన్ని డాన్స్ మూవ్ మెంట్స్ అదరహో అనిపించాయి. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ మీద‌, ఎన్టీఆర్ మీద జ‌నాలు పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ ఒక్క జై క్యారెక్ట‌ర్ తీర్చేసింది.

త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో పాటు టెక్నిక‌ల్ వాల్యూస్‌, క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు కూడా హిట్. ఓ కమర్షియల్ కథ‌లో ఇంత వినోదం, ఇన్ని మలుపులు, సెంటిమెంట్ చివరిదాకా ఉత్కంఠ, ఊహించని క్లైమాక్స్ …ఇవన్నీ కుదరడం బహు అరుదు. ఇవన్నీ ఉంటూనే ఓ నటుడి విశ్వరూపాన్ని చూపే పాత్ర సృష్టించడం ఇంకా అరుదు.

ఇక సినిమాలో ఫ‌ట్ విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు బాబి ఓ వీక్ క‌థ‌ను బేస్ చేసుకుని, క్యారెక్ట‌రైజేష‌న్ల మీద బేస్ అయ్యి సినిమాను తెర‌కెక్కించ‌డం పెద్ద మైన‌స్‌. సినిమాలో బల‌మైన క‌థ కంటే క్యార‌క్ట‌రైజేష‌న్లే డామినేట్ చేస్తాయి. ఫ‌స్టాఫ్‌లో జై క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయ్యేవ‌ర‌కు క‌థ‌నాన్నిచాలా సాధార‌ణంగా న‌డిపాడు. ఆ సీన్ల‌న్ని అంత ఎంగేజింగ్‌గా అనిపించ‌వు.