ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల‌తో కుమ్మేసిన జై ల‌వ‌కుశ‌

అంద‌రూ అనుకున్నట్లే జై లవకుశలు ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్‌, దుబాయ్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మూకుమ్మ‌డిగా దాడి చేస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో బుధ‌వార‌మే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది.

ఇక బుధ‌వారం ప్రీమియ‌ర్ షోల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం జై ల‌వ‌కుశ $ 552,334 (రూ. 3.58 కోట్లు) సాధించి ట్రేడ్ పండితులని సైతం షాక్ కి గురి చేసింది. సాధారణంగా వారం మధ్యలో సినిమా విడుదలైనా కలెక్షన్లు డల్ గానే ఉంటాయి. కానీ జై లవకుశ సినిమా మాత్రం అందరి అంచనాలను తల్ల‌కిందులు చేస్తూ ఇక్క‌డ తొలి రోజు ప్రీమియ‌ర్ల‌తోనే ఏకంగా హాఫ్ మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపానికి ఓవర్సీస్ ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

ఇక శుక్ర‌వారంతో పాటు శ‌ని, ఆదివారాలు క‌లిసిరావ‌డంతో ఈ సినిమాకు ఓవ‌ర్సీస్‌లో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ క‌లిసి రానుంది. ఇక ఏపీ, తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు ప్రారంభం కావ‌డంతో పాటు వ‌చ్చే బుధ‌వారం స్పైడ‌ర్ సినిమా రిలీజ్ అయ్యేవ‌ర‌కు అన్ని థియేట‌ర్ల‌లోను జై ల‌వ‌కుశే ఉండ‌డంతో ఈ సినిమా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.