‘ ల‌వ‌కుశ ‘ ప్రీమియ‌ర్ల‌కు నో ప‌ర్మిష‌న్‌…. ఏం జ‌రిగింది..!

టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల‌కు బెనిఫిట్ షోలు ప‌డ‌డం స‌హ‌జం. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఓవ‌ర్సీస్‌లోనే ముందుగా ఈ షోలు ప‌డుతుంటాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో త‌మ అభిమాన హీరో సినిమా ఫ‌స్ట్ షో చూసేందుకే అభిమానులు సినిమా రిలీజ్ ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తుంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో పెద్ద హీరోల సినిమాల‌కు అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు వేసేందుకు పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కాట‌మ‌రాయుడు నుంచి నిన్న‌టి పైసా వ‌సూల్ వ‌ర‌కూ ఈ స‌మస్యే ఎదుర‌వుతోంది. దీంతో ఏపీలో ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్లు ప‌డిపోతున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారి త్రిపాత్రాభిన‌యం పోషిస్తోన్న జై ల‌వ‌కుశ సినిమా గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాకు హైద‌రాబాద్‌లోనే 100 స్క్రీన్లు కేటాయించారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగైనా బుధ‌వారం అర్ధ‌రాత్రే త‌మ అభిమాన హీరో సినిమా చేసేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఆయ‌న సినిమాలకు ఇక్క‌డ ఎదురు లేదు. ప‌ర్మిష‌న్లు తేలిగ్గా వ‌చ్చేస్తాయి.కాక‌పోతే.. ఈసారి ల‌వ‌కుశ‌కు మాత్రం క‌ష్ట‌మ‌వుతోంది.

హైద‌రాబాద్ డీసీపీ సెల‌వులో ఉన్నారు. ఇక ఇన్‌చార్జ్‌ డీసీపీ ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ షోకి అనుమ‌తి వ‌స్తుందా ? రాదా ? అన్న‌ది డౌట్‌గా ఉంది. హైద‌రాబాద్‌లో ప్రీమియ‌ర్ల‌కు కేరాఫ్ అయిన కూక‌ట్‌ప‌ల్లి భ్ర‌మ‌రాంబ – మ‌ల్లిఖార్జున థియేట‌ర్ల‌లో తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు ఫ్యాన్స్ షో వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. టికెట్లు కూడా అమ్మేశారు. కానీ… అనుమ‌తి మాత్రం రాలేదు. పైసా వ‌సూల్‌లా 5 దాటాకే షో వేయాల‌ని పోలీసులు చెపుతున్నార‌ట‌. మ‌రి షో టైంకు అయినా ప‌ర్మిష‌న్లు వ‌స్తాయా ? లేదా ? అన్న‌ది కాస్త సందేహంగానే ఉంది.