టెన్ష‌న్ పెడుతోన్న’  జై ల‌వ‌కుశ ‘ ర‌న్ టైం

September 13, 2017 at 5:06 am
Jai Lava Kusa

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా ఒక‌టి. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ఈ నెల 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజర్స్, పాటలకు, ట్రైలర్ అన్నీ బాగుండటంతో ఈ సినిమాకు తార‌క్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా ఏకంగా రూ.112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. కథ ప్రధాన బలంగా రూపోందిన ఈ సినిమాకు రన్ టైం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. మూడు పాత్ర‌లు ఉండ‌డం, క‌థా బ‌లంతో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ర‌న్ టైం కాస్త ఎక్కువ‌గానే ఉంది.

జై ల‌వ‌కుశ ర‌న్ టైం ఓవ‌రాల్‌గా 155 నిమిషాలు ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. మూడు పాత్రలు కనుక ఆ మాత్రం నిడివి సహజమే అయినా సినిమా బోర్ కొడితే ఆ ఎఫెక్ట్ రిజ‌ల్ట్‌పై పడుతుంద‌న్న టెన్ష‌న్ అంద‌రిలోను నెల‌కొంది. ఇక ఈ సినిమా ఈ నెల 14న సినిమా సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లనుంది.

 

టెన్ష‌న్ పెడుతోన్న’  జై ల‌వ‌కుశ ‘ ర‌న్ టైం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts