‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘మహానుభావుడు’- బ‌య్య‌ర్ల పొజిష‌న్ ఏంటి…?

టాలీవుడ్ సినిమా వ్యాపారం పెద్ద జూదంగా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాల పంప‌ణీ పెద్ద రిస్క్ అయినా బ‌య్య‌ర్లు మాత్రం వాళ్ల సినిమాల‌పైనే కోట్లు కుమ్మ‌రిస్తుంటారు. టాలీవుడ్‌లో ఇటీవ‌ల సినిమాలు బాగుంటే ఒకేసారి మూడు నాలుగు సినిమాలు వ‌చ్చినా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య శాత‌క‌ర్ణి రెండు సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా హిట్ కొట్టింది.

ఈ నేప‌థ్యంలోనే ఈ ద‌స‌రాకు మ‌హేష్‌బాబు స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌తో పాటు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాల‌పై బ‌య్య‌ర్లు కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రించారు. అయితే ఇప్పుడు జై ల‌వ‌కుశ సినిమా యావ‌రేజ్‌గా ర‌న్ అవుతుంటే, స్పైడ‌ర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక మ‌హానుభావుడుకు హిట్ టాక్ వ‌చ్చింది.

ఇక ఈ మూడు సినిమాల క‌లెక్ష‌న్ల ప్ర‌కారం చూసుకుంటే జై ల‌వకుశ సినిమా కొన్న బ‌య్య‌ర్ల‌కు పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రావ‌డం లేదా 5 శాతం న‌ష్టం 5 శాతం లాభం వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకు స్వ‌ల్ప లాభాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉంటే, కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రావ‌చ్చు.

ఇక స్పైడ‌ర్ అన్ని ఏరియాల్లోను బ‌య్య‌ర్ల‌ను 50 లేదా అంతకు మించిన శాతం భారీ న‌ష్టాలు మిగ‌ల్చ‌వ‌చ్చు. నైజాం, సీడెడ్ ఏరియాల్లో స్పైడర్ న‌ష్టాలు 60 శాతం వ‌ర‌కు ఉండొచ్చ‌ని టాక్‌. మరో సారి బ్రహ్మోత్సవం తర్వాత మహేశ్ స్పైడర్ సినిమాతో బయ్యర్లని నిలువునా ముంచాడని అందరు చెప్పుకుంటున్నారు. ఇక మహానుభావుడు అయితే హిట్ టాక్ తెచ్చుకోవడంతో బయ్యర్లకి భారీ లాభాలు తెచ్చి పెట్టె అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ సినిమా బ‌య్య‌ర్ల‌కు రూపాయికి రూపాయిన్న‌ర వ‌ర‌కు లాభాలు రానున్నాయి.