‘ జై ల‌వ‌కుశ ‘ – ‘ స్పైడ‌ర్ ‘ – ‘ మ‌హానుభావుడు ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌

ద‌స‌రాకు టాలీవుడ్ బాక్సాఫీస్ యుద్ధం అదిరిపోయింది. ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు సినిమాల‌తో పాటు యంగ్ శ‌ర్వానంద్ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌డంతో ఈ మూడు సినిమాల రిలీజ్‌కు ముందు ఏ సినిమా పై చేయి సాధిస్తుందా ? అన్న ఉత్కంఠ అంద‌రిలోను నెల‌కొంది. మూడు సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుడి తీర్పు వ‌చ్చేసింది.

ఈ మూడు సినిమాల్లో వారం రోజుల ముందుగా వ‌చ్చిన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 73 కోట్ల షేర్ క్రాస్ చేసి రూ.75 కోట్ల షేర్ మార్క్‌కు ద‌గ్గ‌ర‌వుతోంది. జై ల‌వ‌కుశ బ‌య్య‌ర్లు సేఫ్ జోన్‌లోకి రావాలంటే ఇంకా ఈ సినిమా 15-20 శాతం రిక‌వ‌రీ చేయాల్సి ఉంది. సెల‌వులు ముగియ‌డంతో పాటు స్క్రీన్లు త‌గ్గ‌డం, ఇప్ప‌టికే సినిమాను చాలా మంది చూసేయ‌డంతో ఈ సినిమా ఈ మొత్తాన్ని ఎంత వ‌ర‌కు రిక‌వ‌రీ చేస్తుంద‌న్న‌ది చూడాలి.

ఇక మ‌హేష్ స్పైడ‌ర్ మూవీ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.50 కోట్ల షేర్ మార్క్‌కు ద‌గ్గ‌ర‌వుతున్నా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌కు, వ‌సూళ్ల‌కు అస్స‌లు పొంత‌న లేక‌పోవ‌డంతో స్పైడ‌ర్ బ‌య్య‌ర్లు 50 శాతానికి పైగా న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.120 కోట్ల బిజినెస్ జ‌రిగింది. సినిమాకు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తే ఈ సినిమా భారీ డిజాస్ట‌ర్ అనుకోవాల్సిందే.

ఇక పండ‌గ‌కు సైలెంట్‌గా థియేట‌ర్ల‌లోకి దిగిపోయిన శ‌ర్వానంద్ మ‌హానుభావుడు ఓవ‌ర్సీస్‌లో హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ సులువుగానే క్రాస్ చేసేసింది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.10 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో సేఫ్ జోన్‌లోకి వ‌చ్చేయ‌నుంది. సినిమాను యూవీ క్రియేష‌న్స్ త‌క్కువ బ‌డ్జెట్‌లో నిర్మించ‌డంతో పాటు బ‌య్య‌ర్ల‌కు కూడా రీజ‌న్‌బుల్ రేట్ల‌కే అమ్మ‌డంతో జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాల కంటే ఈ సినిమా కొన్న వారు ముందుగా లాభాల్లోకి వ‌చ్చేయ‌నున్నారు. మ‌హానుభావుడు లాంగ్ ర‌న్‌లో రూ.30 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.