‘జ‌య జాన‌కి నాయ‌క‌’ TJ రివ్యూ

టైటిల్‌: జ‌య జాన‌కి నాయ‌క‌

న‌టీన‌టులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్య జైశ్వాల్‌, కేథ‌రిన్ థెస్రా, జ‌గ‌ప‌తిబాబు, త‌రుణ్ అరోరా, వాణీ విశ్వ‌నాథ్‌, సుమ‌న్‌ త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: ద్వార‌కా క్రియేష‌న్స్‌

మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: రిషీ పంజాబీ

ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌

నిర్మాత‌లు: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ

ర‌న్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 11 ఆగ‌స్టు, 2017

టాలీవుడ్‌లో మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అయిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ జ‌య జాన‌కి నాయ‌క‌. అగ్ర నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ త‌న‌యుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీను తొలి సినిమాతో క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అయినా కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ ముద్ర వేయించుకున్నాడు. ఇక రెండో సినిమా స్పీడున్నోడు డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక మూడో సినిమాకే బెల్లంకొండ త‌న త‌న‌యుడిని ఏకంగా బోయ‌పాటి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ చేతిలో పెట్టేశాడు. భారీ తారాగ‌ణంతో, భారీ బ‌డ్జెట్‌తో, భారీ అంచ‌నాల‌తో ఈ రోజు థియేటర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ రివ్యూలో చూద్దాం.

స్టోరీ:

జీవితంలో ఉన్న‌త ల‌క్ష్యానికి చేరుకోవాల‌ని ఎన్నో గోల్స్ పెట్టుకుంటాడు హీరో శ్రీనివాస్ (బెల్లంకొండ శ్రీనివాస్). శరత్ కుమార్, ప్రగ్య జైస్వాల్, నందు ఈ గ‌మ్యం చేరేందుకు సాయ‌ప‌డుతుంటారు. కాలేజ్‌లో ఓ విష‌యంలో శీనుని చూసి ఇంప్రెస్ అయిన ర‌కుల్‌ప్రీత్‌సింగ్ (జానకి) శ్రీనివాస్ ప్రేమలో పడుతుంది. కానీ శ్రీనివాస్ మాత్రం ఆమె ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తాడు. శ్రీనివాస్ క్యారెక్ట‌ర్‌ను మార్చాల‌ని జాన‌కి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో అత‌డు జాన‌కి ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఈ క్ర‌మంలోనే శ్రీనివాస్‌కు జాన‌కి గురించి ఓ షాకింగ్ విష‌యం తెలుస్తుంది. ఆమెను కొంద‌రు చంపాల‌ని చూస్తుంటారు. జాన‌కి ఎలాంటి ప్ర‌మాదంలో చిక్కుకుంది ? ఆమెను ఎవ‌రు చంపాల‌ని చూస్తున్నారు ? ఆ విష‌యం తెలుసుకున్న జాన‌కి ఏం చేసింది ? చివ‌ర‌కు స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ? ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:

బోయ‌పాటి శీను సినిమాల‌కు మాస్ ప్రేక్ష‌కులు ఎలా ప‌డి చ‌స్తారో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బోయ‌పాటి సినిమాలు అంటే మాస్ ఉర్రూత‌లూగిపోతారు. మాస్ ప్రేక్ష‌కులు ఈ సినిమాపై పెట్టుకున్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా ఉంటుంది. స‌రైనోడులో ఊర‌మాస్ యాక్ష‌న్‌తో పాటు ఎమోష‌న్స్ ట‌చ్ చేసిన బోయ‌పాటి ఈ సినిమాలో ల‌వ్ ఎలిమెంట్స్ కూడా ట్రై చేశాడు. ల‌వ్‌+యాక్ష‌న్ ఎలిమెంట్స్ మేళ‌వింపుతో ఈ సినిమా క‌థ‌నం ఉంది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్టైలీష్‌గా, ఫిట్ బాడీతో చ‌క్క‌గా సెట్ అయ్యాడు. యాక్ష‌న్స్‌లోను, ఫైట్స్‌లో శీను దుమ్మురేపినా కీల‌క‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎమోష‌న్స్ సీన్ల విష‌యంలో కాస్త వీక్ అయ్యాడు. ఎం.ర‌త్నం రాసిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ సూప‌ర్బ్‌గా ఉన్నా వాటిని ప‌ల‌క‌డంలో అత‌డి వాయిస్ పూర్తిగా ఎలివేట్ కాలేద‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది.

సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ పాజిటివ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తే లెజెండ్ సినిమాతో స్టైలిష్ విలన్ గా కొత్త అవతారం ఎత్తిన జగపతి బాబు మరో సారి ఫెరోషియస్ బాడ్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. ఇక ర‌కుల్‌ప్రీత్‌సింగ్ పెర్పామెన్స్ సినిమాకు మ‌రో ఎస్సెట్‌. ఆమె సినిమాకు హార్ట్ లాంటి రోల్ చేసింది. ఇటీవ‌ల త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌తి సినిమాకు హెల్ఫ్ అవుతోన్న కేథ‌రిన్ ఈ సినిమాలో కూడా త‌న అంద‌చందాల‌తో బాగానే క‌వ్వించింది. న‌క్ష‌త్రం సినిమాతో త‌నలోని గ్లామ‌ర్ యాంగిల్ బ‌య‌ట‌పెట్టిన ప్ర‌గ్య జైశ్వాల్ ఈ సినిమాలో కూడా త‌న అంద‌చందాల‌తో మెప్పించింది.

టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ నిర్మాత‌లు పెట్టిన ప్ర‌తి పైసా తెర‌మీద క‌న‌ప‌డేలా చేయ‌డంలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ప్ర‌తి సీను రిచ్‌నెస్‌గానే ఉంది. ఇక దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ సీన్స్‌లో కంటెంట్‌కు మెయిన్ ఎస్సెట్ అయ్యింది. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాను దుమ్మురేపాలా చేశాయి.

ప్ల‌స్ పాయింట్స్‌(+):

– బోయపాటి శ్రీను డైరక్షన్

– బెల్లంకొండ శ్రీను డ్యాన్స్ అండ్ ఫైట్స్

– రకుల్ ప్రీత్ సింగ్ పెర్పామెన్స్‌

– ప్ర‌గ్య జైశ్వాల్‌, కేథ‌రిన్ గ్లామ‌ర్‌

– యాక్ష‌న్ సీన్లు

– భారీ కాస్టింగ్‌

– ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌

– టెక్నిక‌ల్ వాల్యూస్‌

– జ‌గ‌ప‌తిబాబు, త‌రుణ్ అరోరా విల‌నిజం

మైనస్ పాయింట్స్(-):

– హీరో వీక్ ఎక్స్‌ప్రెష‌న్స్‌

– సింపుల్ స్టోరీ

TJ ఫైన‌ల్ పంచ్‌: ఈ జ‌య జాన‌కి నాయ‌క మాస్ మాస్‌… మ‌మా మాస్

TJ జ‌య జాన‌కి నాయ‌క రేటింగ్‌: 3.25 / 5