‘ జ‌య జాన‌కి ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్ రిపోర్ట్‌

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం మూడు సినిమాల ట్ర‌యాంగిల్ ఫైట్‌లో రిలీజ్ అయిన జ‌య జాన‌కి నాయ‌క మంచి ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ శుక్ర‌వారం జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాలు రిలీజ్ అయినా జాన‌కి మాత్రం బీ, సీ సెంట‌ర్ల‌లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

షాక్ ఏంటంటే ఈ మూడు సినిమాల్లోను రాజు మంత్రికి చాలా ఎక్కువ థియేట‌ర్లు దొర‌క‌గా, లై సినిమా థియేట‌ర్ల ప‌రంగా రెండో ప్లేస్‌లో ఉంది. జ‌య జాన‌కి నాయ‌కకు చాలా త‌క్కువ థియేట‌ర్లు దొరికాయి. ఓవ‌రాల్‌గా థియేట‌ర్ల ప‌రంగా ఈ సినిమా మూడో ప్లేస్‌లో ఉన్నా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం రెండో ప్లేస్‌లో ఉంది.

వ‌సూళ్ల ప‌రంగా ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న నేనే రాజు నేనే మంత్రికి ల‌భించిన థియేట‌ర్ల‌తో పోలిస్తే జాన‌కికి చాలా త‌క్కువ థియేట‌ర్లు దొరికాయి. థియేట‌ర్ల విష‌యంలో టాప్ ప్లేస్‌లో ఉన్న నేనే రాజు నేనే మంత్రితో స‌మానంగా జ‌య జానకి నాయ‌క‌కు వ‌సూళ్లు వ‌చ్చాయి. తొలి మూడు రోజుల‌కు ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లోనే రూ. 8 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి.

జ‌య జాన‌కి నాయ‌క 3 డేస్ వ‌సూళ్లు :

నైజాం – 2.55కోట్లు

సీడెడ్ – 1.45

ఉత్తరాంధ్ర – 1.16

వెస్ట్ – 0.55

కృష్ణ – 0.44

ఈస్ట్ – 0.58

గుంటూరు – 0.85

నెల్లూరు – 0.44