2 డేస్ ఏరియా వైజ్ షేర్‌.. బోయ‌పాటి మాస్ దెబ్బ సూప‌ర్‌

టాలీవుడ్ ఊర‌మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం జ‌య జాన‌కి నాయ‌క‌. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా భారీ కాస్టింగ్‌, భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడుతోంది.

లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌తో పోటీగా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. తొలి రోజు 3.25 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టిన జ‌య జాన‌కి నాయ‌క రెండు రోజుల‌కు ఏపీ+తెలంగాణలో 5.27 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం వెన‌క బోయ‌పాటి మాస్ స‌త్తాయే అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

బీ, సీ సెంట‌ర్ల‌తో పాటు ఏ సెంటర్ల‌లోను ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు రావ‌డంతో పాటు రిపీటెడ్ ఆడియెన్స్ వ‌స్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

జ‌య జాన‌కి నాయ‌క 2 డేస్ ఏరియా వైజ్ షేర్‌

నైజాం – 1.55 కోట్లు

సీడెడ్‌- 0.90 

ఉత్త‌రాంధ్ర – 0.79

ఈస్ట్ – 0.40

వెస్ట్ – 0.41

గుంటూరు – 0.63

కృష్ణా – 0.28

నెల్లూరు – 0.31

——————————————–

ఏపీ+తెలంగాణ షేర్ = 5.27 కోట్లు

——————————————