బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ కండీష‌న్స్ ఇవే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెరంగ్రేటం ఖాయ‌మైంది. స్టార్ మా టీవీలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్ర‌సారం కానుంది. మొత్తం 13 ఎపిసోడ్లలో ప్ర‌సారం అయ్యే ఈ షోకు సంబంధించిన పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయ్యి అంద‌రిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ షో ఒక‌టి రెండు నెల‌ల్లోనే ప్ర‌సారం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్ల చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతుంద‌ట‌. ఈ మేర‌కు టోట‌ల్ టీం అంతా ముంబైలోని ఓ ప్ర‌ముఖ స్టూడియోకు వెళుతున్న‌ట్టు స‌మాచారం. ఇది ఎన్టీఆర్ పెట్టిన కండీష‌నే అని స‌మాచారం.

త‌న బుల్లితెర అరంగ్రేటం చాలా టాప్ క్లాస్‌గా ఉండాల‌ని ప్లాన్ చేసుకుంటోన్న ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ల చిత్రీక‌ర‌ణ‌కు ముంబై స్టూడియోలు వాడ‌డంతో పాటు అక్క‌డ టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ ఉండాల‌ని ష‌ర‌తు పెట్టాడ‌ట‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన స్టార్ మా వాళ్లు ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన ఈ కొత్త కండీష‌న్ల‌కు కూడా ఓకే చెప్పార‌ట‌.