“ఎన్టీఆర్ బిగ్ బాస్  షో ” ఎలా ఉంటుందో తెలుసా…

ఇప్ప‌టికే హిందీలో గ్రాండ్ స‌క్సెస్ అయిన బుల్లితెర సూప‌ర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో కూడా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ మా ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మ‌య్యే తొలి సీజ‌న్‌కు టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రయోక్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని స్టార్ మా అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇక ఈ షో ఎలా న‌డుస్తుందో కూడా స్టార్ మా ప్ర‌క‌టించింది. ఈ షో కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి 12 మంది సెల‌బ్రిటీల‌ను పంపి తాళం వేస్తారు. అక్క‌డ వారికి అన్ని వ‌స‌తులు ఉంటాయి. అయితే వారికి బ‌య‌ట ప్ర‌పంచంతో మాత్రం ఎలాంటి సంబంధం ఉండ‌దు.

వాళ్ల‌కు లోప‌ల సెల్‌ఫోన్లు, టీవీలు, దిన‌ప‌త్రిక‌లు చూసే సౌక‌ర్యం కూడా ఉండ‌దు.ఆ ఇళ్లే వారికి ప్ర‌పంచంగా ఉంటుంది. వారి ప్ర‌తి క‌ద‌లిక‌ల‌ను సీక్రెట్ కెమేరాల‌తో ప‌రిశీలిస్తారు. లోప‌ల వారి న‌డ‌వ‌డిక‌, జీవ‌న‌శైలీ ఎలా ఉంద‌న్న‌ది ప్రేక్ష‌కులు గ‌మ‌నిస్తుంటారు. విభిన్న రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీలు ప్ర‌పంచంతో సంబంధం లేని చోట ఎలా ఉంటారు అన్న‌దే ఆస‌క్తిక‌రంగాను, స‌స్పెన్స్‌గాను ఉండ‌నుంది.

ఇక తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఈ బిగ్ బాస్ షో కోసం వెయిట్ చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ బిగ్ బాస్ షో త‌ప్పకుండా ఓ గేమ్ చేంజ‌ర్ అవుతుంద‌ని తెలిపారు.