హీరోయిన్ త‌మ్ముడి ప్రేమ‌లో మునిగి తేలుతోన్న కాజ‌ల్‌

గ‌తేడాది వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో రేసులో వెన‌క‌ప‌డిపోయిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ యేడాది వ‌రుస హిట్ల‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతుల్లో ఉన్నాయి. ఇక్క‌డ వ‌రుస హిట్లు కొడుతోన్న కాజ‌ల్ బాలీవుడ్‌లో అప్పుడ‌ప్పుడూ మెరుస్తున్నా అక్క‌డ మాత్రం ఆమెకు హిట్లు రావ‌డం లేదు.

తాజాగా ఆమె ఓ హీరోయిన్ త‌మ్ముడు కుర్ర హీరోతో ప్రేమాయణం మొదలు పెట్టినట్లు సమాచారం. ఇది రియ‌ల్ లైఫ్‌లో అయితే ఈ పాటికి ఇండియ‌న్ మీడియా కోడూ కూసేది. ఇది రీల్ లైఫ్‌లో కావ‌డంతో పెద్ద‌గా ట్రెండ్ అవ్వ‌డం లేదు. ఖూన్ మై హై పేరిట రూపొందుతున్న ఈ లఘు చిత్రంలో కాజల్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర శక్తి హీరోగా నటించాడు.

ఈ లఘు చిత్రానికి బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సోదరుడు కుష్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే చక్కని ప్రేమకథ ఇది. ఢిల్లీ యువత మనస్తత్వాలు, ఆలోచనా దృక్పథం ఇందులో చూపించడం జరిగింది అని చెప్పాడు దర్శకుడు సిన్హా. కేవలం పద్దెనిమిది గంటల్లోనే ఈ లఘు చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు.