కాజ‌ల్‌పై మండిప‌డుతోన్న ఎన్టీఆర్‌, ప‌వన్ ఫ్యాన్స్‌

August 17, 2017 at 11:44 am
add_text

మెరుపు క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ‌వుతున్నా ఇంకా అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులో బండి లాక్కొచ్చేస్తోంది. ఇంత పోటీలో కూడా వ‌య‌స్సు పెరుగుతున్నా కాజ‌ల్ 50 సినిమాల్లో నటించింది. త‌న 50వ సినిమాగా ఆమె రానా స‌ర‌స‌న నేనే రాజు నేనే మంత్రి సినిమాలో న‌టించింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కాజ‌ల్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు ఎన్టీఆర్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. ఆ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌ను హర్ట్ చేయ‌డంతో ఇప్పుడు వారంతా కాజ‌ల్‌పై మండిప‌డుతున్నారు.

కాజ‌ల్ తెలుగులో టాప్ హీరోలంద‌రితోను న‌టించి హిట్లు కొట్టింది. త‌న తాజా ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె సెటైర్ల రూపంలో ఆన్స‌ర్లు చేసింది. ఇప్పుడు అవే ఆయా హీరోల‌ను హ‌ర్ట్ చేసి ఆమెపై తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ అతడి హైపర్ యాక్టివ్ నెస్ తగ్గించుకుంటే బాగుంటుంద‌ని చుర‌క వేసిన‌ట్టు మాట్లాడింది. ఇక ప్ర‌భాస్ త‌న ఎన‌ర్జిని పెంచుకుంటే బాగుంటుంద‌ని సెటైర్ పేల్చింది.

ప్రిన్స్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ ‘ఛాటర్ బాక్స్’ అంటూ కొత్త బిరుదు ఇచ్చింది. పవన్ గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడితే బాగుంటుంది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. వీళ్ల అంద‌రి గురించి మాట్లాడిన ఆమె మెగా హీరోలు అయిన రాంచ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌పై మాత్రం ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు.

ఆమె స‌ర‌దాగా ఈ కామెంట్లు చేసినా ఇప్పుడు కాజ‌ల్‌పై ఎన్టీఆర్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. టాప్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు లేని ఆమె వాళ్ల‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయ‌డం మానుకుంటే మంచిద‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. 

కాజ‌ల్‌పై మండిప‌డుతోన్న ఎన్టీఆర్‌, ప‌వన్ ఫ్యాన్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts