కాకినాడ పోరు డిఫ‌రెంట్‌

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఇళ్ల నుంచి త‌ర‌లి వ‌చ్చి మ‌రీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీని ఫ‌లితమే ఇప్పుడు అంద‌రికీ చ‌ర్చ‌గా మారింది. దీని ఫ‌లితం సెప్టెంబ‌రు 1న వెలువ‌డ‌నుంది. దీంతో సెప్టెంబ‌రు 1 అటు బాబుకు క‌లిసి వ‌స్తుందా? జ‌గ‌న్‌కు క‌లిసివ‌స్తుందా? అని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

నిన్న‌టి నంద్యాల ఫ‌లితంతో పోల్చ‌కుంటే కాకినాడ కార్పొరేష‌న్ పోరు.. జ‌గ‌న్‌కి మైన‌స్‌.. బాబుకు ప్ల‌స్ కావాలి. ఇలాంటి రిజ‌ల్ట్‌పైనే కాకినాడ టీడీపీ త‌మ్ముళ్లు లెక్క‌లేన‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. నంద్యాల రిజ‌ల్ట్ పున‌రావృతం అవుతుంద‌ని, టీడీపీ విజ‌య ఢంకా మోగిస్తుంద‌ని త‌మ్ముళ్లు లెక్క‌లేసుకుంటున్నారు కూడా. అదేస‌మ‌యంలో వైసీపీ మాత్రం నంద్యాల వేరు, కాకినాడ వేరు అని త‌మ కూడిక‌లు, తీసివేత‌ల్లో తాము మునిగిపోయారు వైసీపీ నేత‌లు. నిజానికి ఇక్క‌డ నంద్యాలలో మాదిరి సెంటిమెంట్‌లేదు! అంతేకాకుండా ఇద్ద‌రు ప్ర‌ధాన వ్య‌క్తుల మ‌ధ్య పోరు కాదు!!

కాకినాడ కార్పొరేష‌న్ పోరు డిఫ‌రెంట్‌. రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోరు. సెంటిమెంట్‌కు ఎలాంటి తావూలేదు. అయితే, అక్క‌డ ఇక్క‌డ కామ‌న్ స‌బ్జెక్ట్ బాబు అభివృద్ధి మంత్రం. ఇక‌, వైసీపీకి కామ‌న్ స‌బ్జెక్ట్‌.. బాబు అవినీతి పాల‌న‌. ఈ రెండు టాపిక్‌ల మీదే ఇప్పుడు కాకినాడ పోరు సాగుతోంది. దీంతో దీనికి ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ ఉన్నా కూడా ఉప‌యోగం లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులూ పెద్ద‌గా పోటీలో లేన‌ట్టే. దీంతో ఇప్పుడు నిజ‌మైన పోరు.. అభివృద్ధి-అవినీతి ప్ర‌భుత్వం మ‌ధ్యే జ‌రుగుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌కి కాకినాడ జ‌నాలు కాజా తినిపిస్తారా? లేక బాబుకు ప‌ట్టం క‌డ‌తారా? చూడాలి.