కాకినాడ‌లో టీడీపీకి షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మాంచి జోష్‌లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకుంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో టీడీపీ+బీజేపీ కూట‌మి మెజార్టీ డివిజ‌న్లు కైవ‌సం చేసుకుని కార్పొరేష‌న్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు.

ఇక్క‌డ టీడీపీకి అనుకూలంగా వార్ వ‌న్‌సైడ్ అయినా టీడీపీకి మాత్రం అదిరిపోయే షాక్ త‌గిలింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. 22వ డివిజన్‌లో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అన్న కుమారుడు శివప్రసాద్‌పై వైసీపీ అభ్యర్ధి కిశోర్ కుమార్ గెలుపొందారు.

ఇక్క‌డ టీడీపీ బీజేపీకి 9 డివిజ‌న్లు ఇచ్చింది. దీంతో టీడీపీ వాళ్లు పోటీ చేసేందుకు టిక్కెట్లు దొర‌క్క ఇబ్బందులు ప‌డ్డారు. కొంద‌రు రెబ‌ల్స్‌గా పోటీ చేసి కూడా గెలిచారు. ఇంత టైట్ పొజిష‌న్‌లో కొండ‌బాబు త‌న అన్న కుమారులు ఇద్ద‌రికి సీట్లు ఇచ్చుకోవ‌డంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇక అక్క‌డ టీడీపీకి వేవ్ బాగున్నా కొండ‌బాబు ఏక‌ప‌క్ష వైఖ‌రితో విసుగు చెందిన ఓట‌ర్లు ఎమ్మెల్యే అన్న కుమారుడిని ఓడించి ఆయ‌న‌కు బిగ్ షాక్ ఇచ్చారు.