క‌థ‌లో రాజ‌కుమారి TJ రివ్యూ

టైటిల్‌: క‌థ‌లో రాజ‌కుమారి

న‌టీన‌టులు: నారా రోహిత్‌, న‌మితా ప్ర‌మోద్‌, నాగ‌శౌర్య త‌దితరులు

మ్యూజిక్‌: ఇళ‌య‌రాజా, విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌

నిర్మాత‌లు: సుధాకర్ రెడ్డి, సౌందర్య, ప్రశాంతి, కృష్ణ విజయ్

ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ సూర‌ప‌నేని

రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017

నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్ వ‌రుస సినిమాల ప‌రంప‌ర‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ప‌లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రోహిత్‌కు కొంత కాలంగా స‌రైన హిట్ లేదు. మ‌రి ఈ సినిమా అయినా రోహిత్‌కు హిట్ ఇచ్చిందో ? లేదో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ ఎన్నో అవార్డులు గెలుచుకున్న అర్జున్ (నారా రోహిత్‌) స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే అదే నెగిటివ్ యాట్టిట్యూడ్‌ను నిజ జీవితంలోను ఫాలో అవుతూ ఉంటాడు. ఎవ్వ‌రిని లెక్క‌చేయ‌ని అత‌డి విధాన‌మే అత‌డికి ఛాన్సులు వ‌చ్చేలా చేస్తుంది. అయితే అత‌డి జీవితంలో అనుకోకుండా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల్ల అత‌డిలో బ‌లంగా ఉన్న నెగిటివ్ థాట్స్‌, విల‌నిజం, మూర్ఖ‌త్వం మ‌రుగున ప‌డ‌తాయి. అత‌డి వ్య‌క్తిత్వం మార‌డంతో అత‌డికి ఛాన్సులు కూడా రావు.

ఆ టైంలో అర్జున్ తన జీవితంలోనే ఇష్టంలేని వ్యక్తి సీత (నమిత ప్రమోద్) కు దగ్గరై ఆమె కష్టాలు పడుతుంటే చూసి తనలోని మూర్ఖత్వాన్ని తిరిగి బయటకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆతను సక్సెస్ అయ్యాడా లేదా ? చివరికి అతను ఎలా మారాడు ? ఆ మార్పుకు సీత ఎలా కారణమైంది ? అనేదే ఈ క‌థ‌లో రాజ‌కుమారి సినిమా.

TJ విశ్లేష‌ణ‌:

సినిమా స్టార్టింగ్ బాగుంటుంది. హీరో రోహిత్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించే స‌న్నివేశాలు, ఒక రీల్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో కూడా ఎలా విల‌న్‌గా ఉంటాడ‌న్న అంశాన్ని ద‌ర్శ‌కుడు బాగా ప్ర‌జెంట్ చేశాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంది. ద‌ర్శ‌కుడు మ‌హేష్ ఫస్టాఫ్‌లో స్టార్టింగ్ నుంచి స‌గం వ‌ర‌కు బాగానే డీల్ చేశాడు. ఇక ద‌ర్శుడు తీసుకున్న మెయిన్ లైన్ బాగున్నా దానిని డ‌వ‌ల‌ప్ చేసిన విధానం, తెర‌మీద ప్ర‌జెంట్ చేసిన తీరు చాలా నిరుత్సాహ ప‌రిచాయి.

ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంది అనేలోపే అక్క‌డ నుంచి చుక్క‌లు క‌న‌ప‌డ‌డం స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్ మొత్తం బోరింగ్‌గా త‌యారై చివ‌ర‌కు ప‌ర‌మ రొటీన్ ఎండింగ్‌తో ముగుస్తుంది. చివ‌ర‌కు సినిమా ఎలా వెళుతుందంటే హీరో ల‌క్ష్యం ఒక‌టి అయితే ద‌ర్శ‌కుడు క‌థ‌ను మ‌రో గ‌మ్యం వైపు తీసుకెళుతుంటాడు. ఇది చూసి థియేట‌ర్లో ప్రేక్ష‌కుడు త‌ల‌నొప్పి త‌గ్గించుకునేందుకు జండూబామ్ సీసానో లేదా టీ తాగుదార‌నో అనుకుంటాడు. ఇక సినిమా క్లైమాక్స్ అరంగ‌ట ముందూ ఊహించేయ‌వ‌చ్చు.

టెక్నిక‌ల్‌గా ఇళ‌య‌రాజా కంపోజ్ చేసిన రెండు పాట‌లు, విశాల్ చంద్రశేఖ‌ర్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. న‌రేష్ సినిమాటోగ్ర‌ఫీలో అర‌కు అందాలు బాగున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టింది. అయితే అన్ని సీన్లు అలాగే ఉండ‌డంతో ఎడిట‌ర్‌ను మాత్రం పూర్తిగా త‌ప్పుప‌ట్ట‌లేం. నిర్మాణ విలువ‌లు ఓకే. ఇక నారా రోహిత్ వ‌రుస ప్లాపుల ప‌రంప‌రంలో క‌థ‌లో రాజ‌కుమారి కూడా ఓ ప‌రంప‌రే.

TJ ఫైన‌ల్ పంచ్‌: క‌థ లేని రాజ‌కుమారి

TJ క‌థ‌లో రాజ‌కుమారి రేటింగ్‌: 1.75 / 5