క‌ట్ట‌ప్ప‌తో శివ‌గామి రొమాన్స్ స్టోరీ ఇదే

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమా దేశ‌వ్యాప్తంగా భార‌తీయ సినిమా స్క్రీన్‌ను షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే రూ.800 కోట్ల క్ల‌బ్‌లో చేరిన తొలి ఇండియ‌న్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన బాహుబ‌లి 2 క‌ట్ట‌ప్ప రోల్ చేసిన స‌త్య‌రాజ్‌తో పాటు శివ‌గామి రోల్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ రెండు క్యారెక్ట‌ర్లు బాహుబ‌లిలో ఎలా హైలెట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే బాహుబ‌లి 2 సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుల‌కు వీరిద్ద‌రు క‌లిసి రొమాన్స్ చేస్తోన్న సీన్ థియేట‌ర్లో రావ‌డంతో వారంతా షాక్ అయిపోయారు. బాహుబ‌లి 2 ఫ‌స్టాఫ్ చూసి డ్రింక్స్‌, స్నాక్స్ తీసుకుని హ్యాపీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ప్రేక్ష‌కులు లోప‌ల తెర‌మీద క‌ట్ట‌ప్ప‌, స‌త్య‌రాజ్ క‌లిసి రొమాన్స్ చేస్తోన్న సీన్ చూసి షాక్ మీద షాక్ తిన్నారు.

అదేంటి బాహుబ‌లి 2లో వీరిద్ద‌రు క‌ల‌సి రొమాన్స్ చేయ‌డం ఏంట‌ని అంద‌రికి దిమ్మ‌తిరిగి పోయింది. అస‌లు మ్యాట‌ర్ తెలుసుకుని వారు మ‌రోసారి షాక్ తిన్నారు. పోతీస్ వస్త్ర దుకాణం వాణిజ్య ప్రకటన వీరిద్ద‌రు క‌లిసి రొమాన్స్ చేస్తోన్న‌ప్ర‌క‌ట‌న‌ తీశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో కూడా ర‌మ్య‌కృష్ణ మ‌హారాణిగా చేస్తుంది. క‌ట్ట‌ప్ప స‌త్యరాజ్ మాత్రం బాహుబ‌లిలో పాత్ర‌కు భిన్నంగా రాజుగా న‌టించాడు. సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌క‌ట‌న వైర‌ల్‌గా మారింది.