కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి వ‌చ్చే సీట్లు ఇవే…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం తెలంగాణ‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇక్క‌డ ఉండ‌గానే ప్రెస్‌మీట్ కౌంట‌ర్ ఇచ్చారు.

అమిత్ షాకు ద‌ళితుల‌పై ఎంత మాత్రం ప్రేమ‌లేద‌న్న కేసీఆర్ అమిత్‌ తేరాట్పల్లి గ్రామంలో దళితవాడలో వారితో క‌లిసి చేసిన స‌హ‌పంక్తి భోజ‌నం ద‌ళిత‌వాడ‌ల్లో వండింది కాద‌ని…ఆ భోజ‌నం ప‌క్క‌నే ఉన్న ఖ‌మ్మంగూడెం గ్రామంలో మ‌నోహ‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి వండించి పంపించార‌ని కేసీఆర్ తెలిపారు.

అమిత్ షా ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా తెలంగాణ‌లో తాజా స‌ర్వే ప్ర‌కారం బీజేపీకి ఒక్క సీటు కూడా రాద‌ని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇక అమిత్ ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీపై త‌మ‌కు ఉన్న గౌర‌వంతో బీజేపీ ప్ర‌భుత్వంతో త‌మ‌కు రాజ్యంగ‌ప‌ర‌మైన సంబంధాలు కంటిన్యూ అవుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

తెలంగాణ‌లో బీజేపీకి ప్ర‌స్తుతం ఉన్న ఐదు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు ఉన్నాయి. కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటున్నారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ఆయ‌న బీజేపీని చాలా లైట్ తీస్కొంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది.