నంద్యాల‌లో శిల్పా గెలుపుకు కేసీఆర్,జ‌గ‌న్… అస‌లు ప్లాన్ ఇదే!

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం గ‌డువు ముగిసేందుకు మ‌రో వారం రోజులు కూడా లేదు. గెలుపుపై అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ ధీమాగానే ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక‌పై ఒక్క ఏపీలోనే రూ.1000 కోట్ల బెట్టింగ్ జ‌రుగుతోంది. జ‌గ‌న్ 15 రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తున్నాడు. ఇక రేపు బాల‌య్య అక్క‌డ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మ‌రుస‌టి రోజు సీఎం చంద్ర‌బాబు దిగుతున్నాడు. టీడీపీ త‌ర‌పున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ త‌రపున ఎమ్మెల్యేలు ఓవ‌రాల్‌గా నంద్యాల కురుక్షేత్ర సంగ్రామం జ‌రిగే మైదానంలా ఉంటే టీడీపీ, వైసీపీ వాళ్లు పాండ‌వ‌, కౌర‌వుల్లా త‌ల‌ప‌డుతున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వ‌హిస్తున్నారంటూ వైసీపీలో వార్త‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి. మ‌రి కేసీఆర్ వైసీపీ గెలుపుకోసం ఎందుకు డ‌బ్బులు పంపుతున్నాడు ? ఆ స్టోరీ ఏంటో ?  చూద్దాం. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య ఇంట‌ర్న‌ల్ రిలేష‌న్ షిఫ్ ఉంద‌న్న సందేహాలు ఉన్నాయి. 

ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, టీడీపీ వాళ్లు జ‌గ‌న్‌-కేసీఆర్ చీక‌టి బంధం గురించి ఎన్నో విమ‌ర్శలు చేశారు. కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్య‌ల‌కు ఊత‌మిచ్చేలా చంద్ర‌బాబును ఎన్నోసార్లు విమ‌ర్శించినా జ‌గ‌న్‌ను మాత్రం ప‌ల్లెత్తుమాట అన‌లేదు. టీఆర్ఎస్ మంత్రులు, నాయ‌కులు కూడా చంద్ర‌బాబును, టీడీపీనే టార్గెట్ చేస్తున్నారే త‌ప్ప వైసీపీ, జ‌గ‌న్‌ను వారు విమర్శించ‌డం లేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే వీళ్లంతా టీఆర్ఎస్‌లోకి వెళ్లార‌న్న టాక్ ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే నాడు వైసీపీలో ఉన్న బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌, కొండా సురేఖ‌కు టీఆర్ఎస్ టిక్కెట్లు ఇప్పించింది కూడా జ‌గ‌నే అన్న‌ది అప్పుడే లీక్ అయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్ద‌రికి కామ‌న్ శ‌త్రువు అయిన చంద్ర‌బాబును టార్గెట్ చేసేందుకు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఇన్‌డైరెక్టుగా సాయం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

నంద్యాల ఉప ఎన్నిక కోసం తెలంగాణ నుంచే వ‌స్తోంద‌ట‌. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల్లో వైసీపీ పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి కేసీఆర్ రూ. 3 వేల కోట్ల విలువైన ప‌నులు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఈ ప‌నులు ఇప్పించింది జ‌గ‌నే అట‌. ఇప్పుడు నంద్యాల‌లో వైసీపీ క్యాండెట్ శిల్పా మోహ‌న్‌రెడ్డి గెలుపు కోసం తెలంగాణ కాంట్రాక్టుల సొమ్ము నుంచి రూ. 70 కోట్ల‌ను అక్క‌డ‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఈ త‌ర‌లింపు అంతా కేసీఆర్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతుంద‌ని టాక్‌. చంద్ర‌బాబును ఏదోలా దెబ్బ‌కొట్టేందుకే కేసీఆర్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ స‌పోర్ట్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఇప్పుడు న‌డుస్తున్నాయి. ఈ సొమ్మును రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి నంద్యాల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.