ఆమ్ర‌పాలికి కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్‌… ఏం జ‌రిగింది

తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయారు వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. ఆమె ఇప్పుడు యువ‌త‌కు ఓ స్ఫూర్తి, ఆద‌ర్శం, ఐఏఎస్ అంటే ఇలానే ఉండాల‌న్న‌ట్టుగా ఉండే వ్య‌క్తిత్వం ఆమె సొంతం. మ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోష‌ల్ మీడియాలో ఆమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. స‌రే ఎవ‌రు ఎలా ఉన్నా మ‌న సీఎం కేసీఆర్‌కు కొన్ని విషయాలు న‌చ్చ‌వు. ఆయ‌న సిద్ధాంతాలు ఆయ‌న‌వి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆమ్ర‌పాలి డ్రెస్ కోడ్ గురించి ఆమెకు జ‌న‌ర‌ల్ మెసేజ్‌లాగానే చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చార‌ట‌. కేసీఆర్ డైలాగ్ త‌న‌కే అని భావించిన ఆమె బాధ‌ప‌డింద‌ట‌. తెలంగాణ‌లో చేనేత వ‌స్త్రాల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం త‌ర‌పున బాగా కృషి చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ఎంపిక చేశారు.

ఇక కేసీఆర్ ఇటీవ‌ల అధికారుల‌కు కూడా చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని సూచ‌న‌తో కూడిన హెచ్చరిక చేశారు. ఈ మాట‌లు క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలిని టార్గెట్‌గా చేసుకునే కేసీఆర్ మాట్లాడార‌న్న గుస‌గుస‌లు టీ అధికార వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమ్ర‌పాలి డ్రెస్ కోడ్ చూస్తే ఆధునిక‌త‌కు ద‌గ్గ‌రిగా ఉంటుంది.

జీన్స్‌, టీ ష‌ర్ట్స్‌, షార్ట్ క‌ట్స్ డ్రెస్సెస్ ఆమె ఎక్కువుగా వేసుకుంటుంటారు. ఇక కేసీఆర్ ఇలాంటి డ్రెస్సులు ఐఏఎస్‌లు వేసుకుంటే ప్ర‌జ‌ల్లో వారి ప‌ట్ల ఉన్న గౌర‌వం పోతుంద‌న్న‌ట్టుగా మాట్లాడార‌ట‌. దీంతో కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు త‌న‌ను ఉద్దేశించే అన్నార‌ని ఆమె చాలా బాధ‌ప‌డ్డార‌ట‌.