” జాన‌కి – లై – రాజు మంత్రి “…ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు.

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఒకే రోజు ముగ్గురు హీరోలు న‌టించిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగ‌స్టు 11 నుంచి 15 వ‌ర‌కు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో ముగ్గురు ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎవ‌రి రేంజ్‌లో వారు భారీగా ప్ర‌మోష‌న్లు చేసుకున్నారు. మూడు సినిమాల‌లో కొన్ని సినిమాల‌కు మంచి టాక్ రాగా, కొన్ని సినిమాల‌కు ఓకే టాక్ వ‌చ్చింది. మూడు సినిమాల్లో భారీ నెగిటివ్ టాక్ అయితే ఏ సినిమాకు లేక‌పోవ‌డం విశేషం.

ఇక ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోల ద్వారా మూడు సినిమాలు స‌త్తా చాటాయి. రానా “నేనే రాజు నేనే మంత్రి” $140,833 కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో నిలువగా, నితిన్ “లై” $50,623 సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చివరగా బోయపాటి దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి ఓవర్సీస్ ప్రీమియర్ షోలో పరవాలేదనిపించింది. 

రానా నేనే రాజు నేనే మంత్రి ఏకంగా 130 స్క్రీన్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో పాటు అక్క‌డ భారీగా ప్ర‌మోష‌న్లు చేయ‌డం, ముంద‌స్తు అడ్వాన్స్ బుకింగ్‌లు ఎక్కువ కావ‌డంతో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక నితిన్ లై మ‌ల్టీఫ్లెక్స్ మూవీ కావ‌డంతో ఆ సినిమా కూడా ప‌ర్వాలేద‌నిపించుకుంది. ఇక స‌హ‌జంగానే బోయ‌పాటి సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో వ‌సూళ్లు త‌క్కువుగా ఉంటాయి. అయినా కూడా ఆ సినిమా ప‌ర్వాలేద‌నిపించింది.