‘ స్పైడ‌ర్ ‘ బొక్క‌ల లెక్క‌లివే.. ఎంత న‌ష్ట‌మో తెలుసా

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో తొలి రోజు మిన‌హా మిగిలిన అన్ని రోజులు స్పైడ‌ర్ న‌త్త‌న‌డ‌కగా సాగింది. రెండో వీక్‌లోకి ఎంట‌ర్ అయ్యేస‌రికే చాలా ఏరియాల్లో థియేటర్లలో స్పైడ‌ర్ ఎత్తేసి మ‌హానుభావుడు సినిమాను వేస్తున్నారు. ఇక తొలి వారం స్పైడ‌ర్ ఏపీ+తెలంగాణ‌లోని అన్ని ఏరియాల్లో క‌లిపి రూ 31.90 కోట్ల షేర్ రాబ‌ట్టింది. త‌మిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌, ఇత‌ర అన్ని ఏరియాలు క‌లుపుకుని ఈ సినిమా వ‌సూళ్లు రూ.45 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా ఉన్నాయి.

ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌కు చూసుకుంటే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇంత క్రేజ్ ఉన్న సినిమా తొలి వారంలో ఇప్ప‌ట‌కీ కూడా రూ.50 కోట్ల షేర్ రాబ‌ట్ట‌లేదంటే అది మ‌హేష్‌కు పెద్ద మైన‌స్సే. ఇక ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో మ‌హా అయితే మ‌రో రూ.10 కోట్ల వ‌ర‌కు షేర్ కొల్ల‌గొడుతుంది…అంత‌కు మించి ఆశించిందేమి లేదు.

ఎలా చూసుకున్నా స్పైడ‌ర్ సినిమా రూ.60 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా భారీ న‌ష్టాల‌ను మిగిల్చి మ‌హేష్ కెరీర్‌లో బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌రో ఘోర‌మైన డిజాస్ట‌ర్‌గా మిగిలిపోనుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా మూడు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందను కుంటే అక్క‌డ కూడా భారీగా బాల్చీ త‌న్నేసింది. ఇక స్పైడ‌ర్ న‌ష్టాల‌ను తాము భ‌రించ‌లేమ‌ని, త‌మ న‌ష్టాల‌ను నిర్మాత‌లు కూడా పంచుకోవాల‌ని ఫిల్మ్ చాంబ‌ర్‌లో పంచాయితీకి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.