ఎన్టీఆర్ ముందు తేలిపోయిన మ‌హేష్‌

మహేష్ లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. టీజ‌ర్ చూసిన వాళ్ల‌లో కొంత‌మంది మాత్రం పెద‌వి విరుస్తున్నారు. టీజ‌ర్ రొటీన్‌గానే ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా చూసేవాళ్ల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. చాలా త‌క్కువ టైంలోనే స్పైడ‌ర్‌కు కోటి వ్యూస్ వ‌చ్చాయి. 

అయితే మ‌హేష్ స్పైడ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ టీజ‌ర్ రికార్డును మాత్రం క్రాస్ చేయ‌లేదు. రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ నిలిచింది. జై ల‌వ‌కుశ సినిమాలోని జై టీజ‌ర్‌కు 24 గంటల్లోనే 4.98 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్పైడర్ టీజర్ కు మాత్రం ఒక రోజులో 4.04 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. 

స్పైడ‌ర్ టీజ‌ర్‌కు తెలుగు, త‌మిళ్ వ్యూస్ క‌లిపి చెపుతున్నారు. ఈ లెక్క‌న 24 గంటల్లోనే 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయంటున్నారు. ఒక్క తెలుగు వెర్ష‌న్‌కు మాత్రం తీసుకుంటే జై టీజ‌రే రికార్డుగా నిలిచింది