‘ భ‌ర‌త్ అను నేను ‘ …….. చూస్తే కళ్లు తిర‌గాల్సిందే!

August 22, 2017 at 5:47 am
add_text111111

సూపర్ స్టార్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా త‌ర్వాత సౌత్ ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ వ‌చ్చింది. దీంతో మ‌హేష్ న‌టిస్తోన్న స్పైడ‌ర్‌, భ‌ర‌త్ అను నేను సినిమాల అద‌ర్ లాంగ్వేజెస్ రైట్స్ కోసం అదిరిపోయే ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాల హిందీ రైట్స్ కోసం వ‌స్తోన్న ఆఫ‌ర్ల‌తో క‌ళ్లు జిగేల్ మంటున్నాయి.

మురుగదాస్‌తో మ‌హేష్ చేస్తోన్న స్పైడ‌ర్ హిందీ హ‌క్కుల‌ను ఏఏ.ఫిలింస్ సంస్థ దాదాపు రూ. 24 కోట్లు కోట్ చేసి ద‌క్కించుకుంది. ఈ సినిమా త‌ర్వాత కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ హిందీ హక్కులు రూ. 16 కోట్లకు అమ్ము అమ్ముడైనట్లు టాక్‌. ఇక స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. 

ఇక భ‌ర‌త్ అను నేను సినిమా ఇటీవ‌లే ల‌క్నో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కొత్త నటి కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా 2018 సంక్రాంతి లేదా ఆరంభంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

‘ భ‌ర‌త్ అను నేను ‘ …….. చూస్తే కళ్లు తిర‌గాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts