వైసీపీ ఎమ్మెల్యేతో మ‌హేష్‌కు లింకేంటి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగేందుకు కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ్ ప్ర‌మోష‌న్ల మీద కాన్‌సంట్రేష‌న్లు చేసిన టీం రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచి తెలుగులో కూడా ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఇక్క‌డ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా సాక్షి టీవీ ఛాన‌ల్ కోసం ప్ర‌ముఖ న‌టి రోజా మ‌హేష్‌ని ఇంట‌ర్వ్యూ చేసింది. 

ఈ సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా కోసం చిరంజీవితో రోజా చేసిన చిట్‌చాట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతోనే సాక్షి ఛానెల్ మ‌హేష్ – రోజాల‌తో ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేసింది. ఈ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ అన్న‌పూర్ణలోని సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. 

ఈ ఇంట‌ర్వ్యూలో రోజా మ‌హేష్‌ను చాలా స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా, మ‌హేష్ కూడా అంతే స‌ర‌దాగా ఆన్స‌ర్లు చేశాడ‌ట‌. మ‌హేష్ లోని సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఈ ఇంట‌ర్వ్యూలో మ‌రింత బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని స‌మాచారం. మరి రాజకీయాల్లోనూ, టివి షోస్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న రోజా ఇప్పుడు మహేష్ ఇంటర్వ్యూని ఏ రేంజ్ లో చేసిందో చూడాలి.