వినాయ‌క‌చ‌వితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మ‌హేష్‌దా…?

August 21, 2017 at 6:04 am
Mahesh Babu, NTR, Spyder, Jaya Lava Kusa

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు మధ్య ఈ ద‌స‌రాకు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఫైట్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ జైల‌వ‌కుశ‌, 27 మ‌హేష్ స్పైడ‌ర్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. ఈ ద‌స‌రా ఫైట్‌లో ఎవ‌రు గెలుస్తారు ? అని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ద‌స‌రా కంటే ముందే ఎన్టీఆర్‌, మ‌హేష్ మ‌ధ్య మ‌రో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. ద‌స‌రా కంటే ముందే వ‌స్తోన్న వినాయ‌క‌చ‌వితి రోజున వీరు ఫైట్‌కు రెడీ అవుతున్నారు. అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే మ‌హేష్ స్పైడర్ మొట్టమొదటి టీజర్ సాధించిన రికార్డులను ఆ తరువాత విడుదలైన జై లవ కుశ టీజర్ బ్రేక్ చేయడమే కాకుండా దక్షిణాది టాప్ హీరోల టీజర్ రికార్డులను కూడా జై లవ కుశ దాటేసింది.

ఇక స్పైడ‌ర్ రెండో టీజ‌ర్ అభిమానుల‌కు పెద్ద‌గా మెప్పించ‌లేదు. దీంతో సినిమాకు రిలీజ్‌కు ముందు మ‌రింత హైప్ తెచ్చేందుకు వినాయ‌క చ‌వితి కానుక‌గా మూడో టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ మూడో టీజ‌ర్ వ‌స్తోంది. దీంతో వినాయ‌క‌చ‌వితి కానుక‌గా టీజ‌ర్ల‌తో ఎన్టీఆర్‌, మ‌హేష్ పోటీప‌డుతున్నారు. మ‌రి ఈ వార్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ? చూడాలి.

 

వినాయ‌క‌చ‌వితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మ‌హేష్‌దా…?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts