మ‌హేష్ అవుట్‌… చెర్రీ ఇన్‌

September 9, 2017 at 9:38 am
Mahesh babu, Ram charan

టాలీవుడ్‌లో గ‌త రెండేళ్లుగా సంక్రాంతి స‌మ‌రం మ‌హారంజుగా సాగుతోంది. గ‌తేడాది ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, బాల‌య్య డిక్టేట‌ర్‌, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న‌తో పాటు శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్లు కొట్టారు.

ఈ క్ర‌మంలోనే 2018 సంక్రాంతికి కూడా ఇక్క‌డ వార్ అదిరిపోనుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – త్రివిక్ర‌మ్ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఇక బాల‌య్య – కేఎస్‌.ర‌వికుమార్ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఖ‌ర్చీఫ్ వేసుకుని కూర్చుంది. ఇక ఈ రెండు సినిమాల కంటే ముందుగానే మ‌హేష్‌బాబు – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతోన్న భ‌ర‌త్ అను నేను సినిమా సంక్రాంతికి రావాల‌ని డిసైడ్ అయ్యింది.

దీంతో సంక్రాంతికే రావాల‌నుకున్న చెర్రీ – సుక్కు రంగ‌స్థ‌లం 1985 సినిమా టీం ఈ పోటీ త‌ట్టుకోలేక తమ సినిమాను వాయిదా వేసేసుకుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే భ‌ర‌త్ అను నేను షూటింగ్ లేట్ అవ్వ‌డంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. భ‌ర‌త్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 20 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదట‌. ఈ లెక్క‌న ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో మార్చి, లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మ‌హేష్ సినిమా వాయిదా ప‌డ‌డంతో ఇప్పుడు చెర్రీ రంగంస్థ‌లం సినిమాను సంక్రాంతికి దింపేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. సో ఇప్పుడు మ‌హేష్ ముందుకు వెళితే చెర్రీ బ్యాక్ అవుతున్నట్ల‌య్యింది. అయినా సంక్రాంతికి ఇప్ప‌టికే బాల‌య్య‌, ప‌వ‌న్ ఫిక్స్ అవ్వ‌డంతో ఇప్పుడు చెర్రీ కూడా వ‌స్తున్నాడు.

 

మ‌హేష్ అవుట్‌… చెర్రీ ఇన్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts