బిగ్ బాస్ హౌస్‌లోకి మ‌హేష్‌….ఒప్పించిన డైరెక్ట‌ర్‌

August 26, 2017 at 11:05 am
Mahesh babu

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమాపై సౌత్ ఇండియ‌న్ సినిమా స‌ర్కిల్స్‌లో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రూ.100 కోట్ల పైచిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, అర‌బిక్ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ అదిరిపోయే ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్‌ను మురుగ‌దాస్ బిగ్ బాస్ షోకు పంపేందుకు ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్ర‌సార‌మ‌వుతోన్న బిగ్ బాస్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ షో టీఆర్పీ రేటింగ్స్ టాప్ లేపుతున్నాయి. ప్ర‌స్తుతం తెలుగులో రిలీజ్ అవుతోన్న సినిమాల ప్ర‌మోష‌న్లు కూడా ఈ షో ద్వారా చేసుకుంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీని రానా, ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాన్ని తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ సినిమాని విజయ్ దేవరకొండ ప్రచారం చేసుకున్నారు.

ఇందుకోసం వీరు పూణేలోని బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి అక్క‌డ నాలుగు గంట‌ల పాటు స్పెండ్ చేసి వ‌చ్చారు. ఇక ఇప్పుడు మహేష్ త‌మిళ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. మ‌హేష్‌కు తమిళ్‌లో కాస్త ఇమేజ్ త‌క్కువే. ఇప్పుడు బిగ్ బాస్ షోకు వెళితే స్పైడ‌ర్ సినిమాకు కావాల్సినంత పాపులారిటీ వ‌స్తుంద‌న్న‌దే మురుగ‌దాస్ ప్లాన్‌.

ఇక మ‌హేష్ కూడా అక్క‌డ బిగ్ బాస్‌ను హోస్ట్ చేస్తోన్న క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు ఆయ‌న కుమార్తె శృతీహాస‌న్ మీద ఉన్న గౌర‌వంతో ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మ‌రి మ‌హేష్ తెలుగు బిగ్ బాస్ హౌస్‌కు కూడా వెళితే ఎన్టీఆర్‌-మ‌హేష్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నువిందే.

 

బిగ్ బాస్ హౌస్‌లోకి మ‌హేష్‌….ఒప్పించిన డైరెక్ట‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts