‘ స్పైడ‌ర్ ‘ రిజ‌ల్ట్ తేడా కొడుతోందే..!

September 5, 2017 at 6:13 am
Mahesh babu, spyder, Murugadas

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ – ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే తెలుగు సిని జ‌నాలే కాదు టోట‌ల్ సౌత్ ఇండియా సినిమా జ‌నాలంద‌రూ ఈ సినిమా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని ఆశించారు. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని భావించారు. అయితే సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు స్పైడ‌ర్ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమా మీద ఎందుకు గాని హైప్ క్రియేట్ అవ్వ‌డం లేదు.

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశతో పోలిస్తే స్పైడ‌ర్‌కు అనుకున్నంత బ‌జ్ రావ‌డం లేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్పైడ‌ర్ స్టిల్స్‌, టీజ‌ర్లు కూడా అంత ఎట్రాక్టివ్‌గా లేవు. ఇక ఇప్ప‌ట‌కీ రెండు పాట‌లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాట‌ల‌కు కూడా ఏ మాత్రం గుడ్ రెస్పాన్స్ లేదు. ఈ రెండు పాటలు వింటుంటే మురుగదాస్‌ తమిళ వాసనలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టు అనిపిస్తోంది.

ఇక క‌థ కూడా మ‌హేష్ అభిమానుల‌కు, మాస్‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుంద‌న్న భ‌యం కూడా వెంటాడుతోంది. భారీ బ‌డ్జెట్ సినిమా అయినా, స్టిల్స్‌, టీజ‌ర్ల‌కు ఆశించినంత రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో బిజినెస్ విష‌యంలో కూడా నిర్మాత‌లు చెప్పిన రేట్లు ఇచ్చేందుకు బ‌య్య‌ర్లు ముందుకు రావ‌డం లేదంటున్నారు.

ఇక సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌కు మొత్తం ప్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. సినిమా రిజ‌ల్ట్ అంతా మురుగ‌దాస్ చేతుల్లోనే ఉంది. ఇంట‌ర్న‌ల్‌గా విన‌ప‌డుతోన్న టాక్ ప్ర‌కారం స్పైడ‌ర్‌పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే మురుగ‌దాస్ కావాల‌నే అంచ‌నాలు త‌గ్గిస్తున్నాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. మ‌రి స్పైడ‌ర్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ఈ నెల 27న తేలిపోనుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ క‌న్‌ఫ్యూజ్ త‌ప్ప‌దు.

 

‘ స్పైడ‌ర్ ‘ రిజ‌ల్ట్ తేడా కొడుతోందే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts