‘ స్పైడ‌ర్ ‘ స్టోరీ…. మ‌రో ప్ర‌పంచంలోకి ఎంట్రీ ఖాయం

September 13, 2017 at 3:21 am
Mahesh babu, Spyder

మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి వ‌స్తోన్న లీకులు సినిమాపై హైప్‌ను మ‌రింత పెంచ‌డంతో పాటు రొమాటు నిక్క‌పొడుచుకునేలా ఉంది. స్టోరీ లైన్ వింటుంటేనే ఇలా ఉందంటే ఇక తెర‌మీద చూస్తే ఎలా ఉంటుందో ఊహకే అంద‌డం లేదు.

మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొంద‌రు విదేశీ ఉగ్ర‌వాదులు మ‌న దేశ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టి, ప్ర‌భుత్వాల‌ను లొంగ‌దీసుకోవాల‌ని ప్లాన్ చేస్తుంటారు. ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ అయిన హీరో ప్ర‌జ‌ల చేతే తెలివిగా టెర్ర‌రిస్టుల‌ను ప‌ట్టిస్తాడ‌ట‌.

అయితే ఇందుకోసం హీరో చాలా ఎత్తులు, స‌రికొత్త ప్లాన్లు వేస్తాడ‌ట‌. ఇందుకోసం ఓ రియాలిటీ షో కూడా ఉంటుంద‌ట‌. టీవీ షో ల పట్ల మహిళలకు వున్న ఆసక్తిని వాడుకుని, మహిళల ద్వారానే పరిశోధన చేయించి, విలన్ ఎక్కడున్నాడో కనిపెట్టే ప్లాన్ హీరో వేస్తాడట. దీంతో మ‌హిళ‌లు అంతా ఈ టీవీ షో లైవ్‌లో పాల్గొని విల‌న్ ఆచూకీ తెలుసుకుంటార‌ట‌.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం సీరియ‌స్‌ మోడ్లో సాగుతూ సినిమాకే మేజ‌ర్ హైలెట్ల‌లో ఒక‌టిగా నిలిచింద‌ని తెలుస్తోంది. గ‌తంలో మ‌హేష్ దూకుడు సినిమాలో కూడా రియాలిటీ షో ఉంటుంది. అయితే అది కామెడీగా ఉంటే స్పైడ‌ర్ రియాలిటీ షో చాలా సీరియ‌స్‌గా ఉంటుంది. మ‌రి క‌థ వింటుంటూనే మురుగ‌దాస్ మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిన‌ట్టుగా ఉంది. ఇక సినిమాతో పూన‌కాలు రావ‌డం ఖాయ‌మేనేమో..!

 

‘ స్పైడ‌ర్ ‘ స్టోరీ…. మ‌రో ప్ర‌పంచంలోకి ఎంట్రీ ఖాయం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts