మూవీ ఫీల్డ్ అడుగు పెట్టడం ఎంత కష్టమో.. ఆ తర్వాత కెరీర్‌ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగడం మరింత కష్టం! అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఫస్ట్‌ది చాలా సింపుల్‌గా జరిగిపోయింది. గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు కాబట్టి అదిఓకే. కానీ, రెండో స్టెప్పే.. ఇప్పుడు ప్రిన్స్‌ని డోలాయమానంలో పడేస్తోంది. తన క్రమశిక్షణ, నిబద్ధత అనేవి ఇప్పుడు ఆయనకే బూమరాంగై ప్రాణం మీదకుతెచ్చాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజగా వచ్చిన స్పైడర్ ప్రిన్స్‌కి బిగ్గెస్ట్ లాస్! నిజానికి మురుగదాస్ మూవీ, ప్రిన్స్ యాక్షన్ అనే సరికి భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి.
అయితే, స్టోరీలో బిగింపు లేకపోవడం సాగతీత, పాత సీన్లే రిపీట్ అవ్వడం వంటివి మూవీని 70% మసక బార్చాయి. దీంతో స్పైడర్ పూర్తిగా ఫ్లాప్ కాకపోయినా బిలో ఏవరేజ్ అనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక, ప్రిన్స్ విషయానికి వస్తే.. తను సూపర్ హీరో. ఈ విషయం ఒప్పుకొని తీరాలి. ఈ క్రమంలోనే ఆయన తన పనేదో తాను చేసుకుపోతున్నాడు. డైరెక్టర్ విషయంలో అస్సలు వేలు పెట్టడు. కథ ఒక్కసారి వినడమే తప్ప .. తర్వాత ప్రతి సీన్‌కి దానిలో జోక్యం ఉండదు. ఇక, స్క్రీన్ ప్లే విషయంలోనూ అంతే.
ఇవే ఇప్పుడు ప్రిన్స్ కెరీర్‌ను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. తనకున్న అనుభవంతో ఈ విషయాల్లో కొద్దో గొప్పో జొక్యం చేసుకుంటే తప్పులేదనే కామెంట్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఎంత సేపూ తన గ్లామర్, యాక్షన్లపైనే ఆధారపడితే.. ఫలితం స్పైడర్గానే ఉంటుందని చెబుతున్నారు. నిజానికి రెండేళ్ల కిందట వచ్చి శ్రీమంతుడు తప్ప మరో హిట్ మహి ఖాతాలో లేదు. వన్, ఆగడు ప్లాప్ తర్వాత శ్రీమంతుడు హిట్ అయినా గతేడాది వచ్చిన బ్రహ్మోత్సవం ఘోరమైన డిజాస్టర్.
ఇక స్పైడర్‌తో మహేష్ మార్కెట్ పెరుగుతుందనుకుంటే ఇది కూడా కెరీర్‌కు ఉపయోగపడేలా లేదు. త్వరలో వస్తుందని భావిస్తున్న భరత్ అను నేనుపై అతడి ఆశలు ఉన్నాయి. ఏదేమైనా ప్రిన్స్ తన కెరీర్ కోసం మారాల్సిన అవసరం ఉంది. తాజాగా జూనియర్ తెచ్చిన జై మాదిరిగానే డిఫరెంట్ కాన్సెప్ట్ అవసరం అనేది జనాల మాట. ఇక మంచి కథలు, డైరెక్టర్ సినిమా ఎలా తీస్తున్నాడు అనేది కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మరీ వేలు పెట్టకపోయినా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ప్రిన్స్ ఎలా ఆలోచిస్తున్నాడో చూడాలి.