డిజాస్ట‌ర్ ‘ స్పైడ‌ర్‌ ‘ కు రూ.150 కోట్లు… మ‌రి న‌ష్టాల లెక్కేంటి

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా వ్యాప్తంగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో వారంలోకి రాకుండానే చేతులు ఎత్తేసింది. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్ల నుంచి స్పైడ‌ర సినిమాను ఎత్తేశారు.

బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్‌కు ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ‌. సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అంటున్న టాక్ వ‌చ్చేస్తే మ‌రోవైపు సినిమా నిర్మాత‌లు మాత్రం 150 కోట్లు రూపాయిలు స్పైడర్ సినిమా కలెక్ట్ చేసిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూసిన జ‌నాలు షాక్ అవుతున్నారు. సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయితే రూ.150 కోట్ల వ‌సూళ్లు ఎలా వ‌చ్చాయ‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సినిమా గ్రాస్ వ‌సూళ్లు సినిమా హిట్‌ను డిసైడ్ చేయ‌లేవు. షేర్ లెక్క‌మీదే సినిమా హిట్ ప్లాప్ అన్న‌ది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు ఎంత డ‌ప్పుకొట్టుకుంటున్నా స్పైడ‌ర్ సినిమాకు రూ.60 కోట్ల న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే రెండు వ‌రుస ప్లాపుల‌తో మ‌హేష్ కెరీర్ గ్రాఫ్ బాగా ప‌డిపోయింది. మరి కొరటాల దర్శకత్వంలో వస్తున్న భారత్ అనే నేను సినిమా మహేష్‌కు బూస్ట‌ప్ ఇస్తుందేమో ? చూడాలి.