సౌత్ ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ హీరోగా మ‌హేష్‌

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు సౌత్ ఇండియ‌న్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది. మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఎలాంటి భారీ అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఈ టీజ‌ర్ వ్యూస్ విష‌యంలో మ‌హేష్‌బాబుకు సౌత్ ఇండియాలోనే టాప్ ర్యాంకు సాధించిపెట్టింది. స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. స్పైడ‌ర్ త‌ర్వాత అజిత్ వివేగం 6. 09 మిలియన్, రజనీ కబాలి 5.1 మిలియన్, పవన్ కళ్యాణ్ కాటమరాయుడు 3. 7 మిలియన్ వ్యూస్‌తో త‌ర్వాత స్థానాల్లో నిలిచాయి.