మ‌హేష్ స్పైడ‌ర్ ప్రి రిలీజ్ బిజినెస్… ఎన్ని కోట్లో తెలిస్తే షాకే

ప్రిన్స్ మ‌హేష్‌బాబు – స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ టాప్ లేపుతోంది. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్ది బిజినెస్ అదిరిపోతోంది. ఇక ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమాకు రూ. 36 కోట్లకు భేర‌సారాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. నైజాంలో రూ. 25 కోట్లు ప‌లుకుతుండ‌గా, మ‌హేష్‌కు చాలా వీక్ ఏరియా అయిన సీడెడ్‌లో రూ. 12 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌.

ఇక తెలుగు సినిమాకు అక్ష‌య‌పాత్ర‌గా మారిన పొరుగు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లో రూ. 8, ఓవ‌ర్సీస్‌లో రూ. 16 కోట్లు రావ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక మురుగ‌దాస్ మానియాతో కోలీవుడ్‌లో ఈ సినిమాను రూ.18 కోట్లు చెపుతున్నార‌ట‌. హిందీలో రూ. 10 కోట్ల ద‌గ్గ‌ర భేరం న‌లుగుతోంది. ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ రూ. 125 కోట్లు జ‌రుగుతోంద‌ట‌.

ఇక థియేట్రిక‌ల్ రైట్స్‌కు తోడు శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కులు క‌లుపుకుంటే ఈజీగా నూట యాభై కోట్ల మార్కుని దాటిపోతుంది. ఈ చిత్రానికి బడ్జెట్‌ అనుకున్న దాని కంటే బాగా ఎక్కువ కావడంతో నిర్మాత‌లు కూడా ఎక్కువ రేట్లు చెపుతున్నారు. ఇక తెలుగులోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇక్క‌డే రూ. 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రావాలి. సినిమాకు ఏ మాత్రం హిట్‌టాక్ వ‌చ్చినా సులువుగానే ఆ మార్క్ క్రాస్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.