‘ స్పైడ‌ర్ ‘ బ్యాడ్ టాక్ వెన‌క రోజా హ్యాండ్‌

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇటీవ‌ల కాలం అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఆమె ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ అంతా నెగిటివ్‌గానే జ‌రుగుతోంది. గ‌తంలో ఆమె టీడీపీలో ఉన్న‌ప్పుడు రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రాలేదు. టీడీపీలో రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ త‌ర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు వైఎస్‌ను క‌లిసిన వెంట‌నే ఆయ‌న అక‌స్మిక మృతి చెంద‌డంతో రోజా వ్య‌తిరేకులు ఆమె ఎక్క‌డ అడుగుపెడితే అక్క‌డ అంతా భ‌ష్మీప‌ఠ‌ల‌మే అని ప్ర‌చారం స్టార్ట్ చేశారు.

రోజా దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆమె వైసీపీలో చేరి జ‌గ‌న్‌ను సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ  మాత్రం ఓడిపోయింది. జ‌గ‌న్ సీఎం అవ్వాల‌న్న చిర‌కాల కోరిక నెర‌వేర‌లేదు. ఇక కొద్ది రోజుల క్రితం ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా ఆమె వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. రోజాను కొన్ని వార్డుల్లో మ‌హిళ‌లు త‌మ ఏరియాలోకి రావ‌ద్ద‌ని కూడా ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. క‌ట్ చేస్తే నంద్యాల‌లో వైసీపీ ఘెరంగా ఓడిపోయింది.

ఆ త‌ర్వాత ఆమె కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా అక్క‌డ ప్ర‌చారం చేశారు. కాకినాడ‌లో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. మ‌ధ్య‌లో ఓ సారి రోజా బ్యాట్ ప‌ట్టుకుని క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఆ వెంట‌నే భార‌త్ ఐసీసీ క్రికెట్ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోజా ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ అంతా మ‌టాష్ అన్న టాక్ బాగా ఆమె యాంటీ వ‌ర్గం వాళ్లు స్ప్రెడ్ చేసేశారు.

ఇక తాజాగా మ‌హేష్‌బాబు న‌టించిన స్పైడ‌ర్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు స్పైడ‌ర్‌కు బ్యాడ్ టాక్‌ను కూడా రోజా యాంటీ ఫ్యాన్స్ ఆమె అక్కౌంట్‌లో వేసేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా సాక్షి ఛానెల్ రోజాతో మ‌హేష్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. దీంతో స్పైడ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో రోజా కాలు పెట్టిందో లేదో ఆ సినిమాకు ఆమె ఎఫెక్ట్ ప‌డి సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చేసింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. పాపం ఇలాంటి విష‌యాల్లో రోజా ద‌శ ఎప్ప‌ట‌కీ మారుతుందో ?  చూడాలి.