బ‌న్నీకి ప్ల‌స్ అయిన బాహుబ‌లి

బాహుబ‌లి 2 దెబ్బ‌తో తెలుగు సినిమాల‌కు ఇండియా వైజ్‌గా సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాహుబ‌లి రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని సినిమాల రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించింది. దీంతో నార్త్ టు సౌత్ అన్ని భాష‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వారు ఇప్పుడు తెలుగు సినిమాల వైపే చూస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో న‌టిస్తున్నాడు. బ‌న్నీ బ్రాహ్మ‌ణుడిగాను, కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌గాను న‌టిస్తోన్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ కానుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు.

డీజే హిందీ రైట్స్‌ను ఓ నిర్మాత రూ. 7 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఓ ప్రాంతీయ భాష‌లో తెర‌కెక్కిన డ‌బ్బింగ్ సినిమా రైట్స్‌కు ఈ రేంజులో రేటు ప‌ల‌క‌డం నిజంగానే గ్రేట్‌. ఈ క్రెడిట్ బాహుబ‌లికే ద‌క్కుతుంద‌ని చెప్పాలి. బాహుబ‌లి త‌ర్వాత తెలుగులో వ‌స్తోన్న పెద్ద సినిమాల‌న్నింటి డ‌బ్బింగ్ రైట్స్‌కు మిగిలిన భాష‌ల్లో అదిరిపోయే రేటు ప‌లుకుతోంది.