సౌమ్యుడ‌న్న మంచి ఇమేజె.. కానీ జనసేన పోటీ ప్రభావం ఎంత?

మండ‌లి ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ పేరు విన‌గానే మ‌నకు రాజ‌కీయాల‌కు అతీతంగా తెలుగు భాష కోసం ప‌రిత‌పించే వ్య‌క్తిగా మ‌దిలో మెదులుతుంది. దివంగ‌త మాజీ మంత్రి మండ‌లి వెంక‌ట‌కృష్ణారావు రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కాంగ్రెస్ నుంచి 1999, 2004లో రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌లో మంత్రిగా ప‌నిచేసిన బుద్ధ‌ప్ర‌సాద్‌కు వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడ‌న్న మంచి ఇమేజ్ ఉంది.

2009లో ఓడిపోయిన బుద్ధ‌ప్ర‌సాద్ 2014 ఎన్నిక‌ల టైంలో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ అభ్య‌ర్థి సింహాద్రి ర‌మేష్‌ను ఓడించారు. ఈ మూడేళ్ల ఎమ్మెల్యే పాల‌న‌లో డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్నా ఓ సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌గా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో కూడిన అభివృద్ధి చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. కామ‌న్‌గా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే అభివృద్ధే త‌ప్ప ఆయ‌న స్థాయిలో ప్ర‌త్యేక అభివృద్ధి లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ సింహాద్రి ర‌మేష్ వ్య‌క్తిగ‌తంగా స్ట్రాంగ్‌గా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ చాలా బ‌ల‌హీనంగా ఉండ‌డం కూడా బుద్ధ‌ప్ర‌సాద్‌కు బాగా క‌లిసిరానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తే కాపుల ఓట్లు మాత్రం టీడీపీ నుంచి చీల‌డం ఆయ‌న‌కు మైన‌స్ లాంటిదే. జ‌న‌సేన స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన కాపు అభ్య‌ర్థిని రంగంలోకి దించితే అప్పుడు ఫ‌లితం మూడు పార్టీల మ‌ధ్య ఎలా ఉంటుంది అన్న‌ది ప్ర‌స్తుతానికి అయితే స‌స్పెన్సే.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడ‌న్న ఇమేజ్‌

– తెలుగు భాషాభివృద్ధి కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌రిత‌పించే వ్య‌క్తిగా తెలుగు ప్ర‌జ‌ల్లో గుర్తింపు

– అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ముందంజ‌

మైన‌స్ పాయింట్స్ (-) :

– పార్టీ శ్రేణులను స‌మ‌న్వ‌యం చేయ‌లేక‌పోవ‌డం

– పాత టీడీపీ నాయ‌కుల‌తో స‌రైన స‌ఖ్య‌త లేదు

– నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ప్ర‌త్యేక‌మైన కృషి లేక‌పోవ‌డం

– జ‌న‌సేన నుంచి స్ట్రాంగ్ అభ్య‌ర్థి ఉంటే కాపుల ఓట్ల‌లో చీలిక మైన‌స్‌

తుది తీర్పు :

చంద్ర‌బాబు వ‌ద్ద బుద్ధ‌ప్ర‌సాద్‌కు మంచి మార్కులు ఉండ‌డంతో 2014లో ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న‌కే తిరుగులేకుండా టీడీపీ టిక్కెట్టు ద‌క్కుతుంది. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. జ‌న‌సేన ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ ఇక్క‌డ అదే వ‌ర్గం నుంచి స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కుడికి టిక్కెట్టు ఇస్తే కాపుల ఓట్ల‌లో భారీ చీలిక రావ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. 2009లో సైతం ఇక్క‌డ ప్ర‌జారాజ్యంకు గ‌ణ‌నీయ‌మైన ఓట్లు ప‌డ‌డంతో ఓట్ల చీలిక వ‌ల్ల బుద్ధ‌ప్ర‌సాద్ టీడీపీ అభ్య‌ర్థి అంబ‌టి బ్రాహ్మ‌ణ‌య్య చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతానికి నియోజ‌క‌వ‌ర్గంలో బుద్ధ ప్ర‌సాద్‌కు చెప్పుకోద‌గ్గ రీతిలో వ్య‌తిరేక‌త లేక‌పోయినా జ‌న‌సేన ప్ర‌భావం ఎలా ఉంటుందో అన్న డౌట్లు ఆయ‌న‌తో పాటు రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు ఉన్నాయి.