‘ యుద్ధం శ‌ర‌ణం ‘ వ‌ర్సెస్ ‘ మేడ‌మీద అబ్బాయి ‘ …విన్న‌ర్ ఎవ‌రంటే

September 9, 2017 at 6:50 am
meda Meeda abbayi, yudham sharanam, tollywood

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన యుద్ధం శ‌ర‌ణం, కామెడీ చిత్రాల హీరో అల్ల‌రి న‌రేష్ న‌టించిన మేడ‌మీద అబ్బాయి రిలీజ్ అయ్యాయి. చైతు గ‌త మూడు సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. ఇక వ‌రుస ప్లాపుల్లో ఉన్న అల్ల‌రి న‌రేష్ మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే రీమేక్ సినిమాలో న‌టించాడు.

ఓ వైపు అర్జున్‌రెడ్డి హ‌వా కొన‌సాగుతుండ‌గానే థియేట‌ర్ల‌లోకి మంచి అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు హిట్ కొట్టారు ? అన్న‌దానిపై ప్రేక్ష‌కుల అంచ‌నాలు, స‌మీక్ష‌ల‌తో శుక్ర‌వారం సాయంత్రానికే క్లారిటీ వ‌చ్చేసింది. షాక్ ఏంటంటే ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోలేక‌పోయాయి. రెండు సినిమాల‌కు ప్లాప్ టాకే వ‌చ్చింది.

యుద్ధం శ‌ర‌ణి సినిమా ఫ‌స్టాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆక‌ట్టుకున్నా, రొటీన్‌గా ఉన్న‌ హీరో -విల‌న్ రివేంజ్ డ్రామా పండ‌లేదు. ఇక కథలో లవ్ స్టొరీ, కామెడీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. చైతు గ‌త యేడాది చేసిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమానే అటూ ఇటూ తిప్పి చాలా చెత్త‌గా తీశార‌న్న విమ‌ర్శ‌లు మూట‌క‌ట్టుకుంది.

ఇక మేడ‌మీద అబ్బాయి విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్ కామెడీ , ఇంటర్వెల్ చిన్నపాటి ట్విస్ట్, నరేష్ నటన కొంత పర్వాలేదనిపించినా ఏమాత్రం వినోదం, పద్దతి లేని సెకండాఫ్ ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు చూపించాయి. స్లో మోష‌న్ స‌న్నివేశాలు, సిల్లీ స్టోరీతో ప్రేక్ష‌కుల‌కు న‌ర‌కం క‌న‌ప‌డిందంటున్నారు. అల్ల‌రి న‌రేష్ గ‌త సినిమాల రేంజ్‌లో కూడా వినోదం లేక‌పోవ‌డంతో పాటు సినిమా చాలా బోర్‌గా ఉండ‌డంతో ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గ‌ర ఏది బిగ్గెస్ట్ ప్లాప్ అవుతుంద‌ని అన్న దానికోస‌మే పోటీ ప‌డ‌నున్నాయి. ఇటు స‌మీక్ష‌కుల‌తో పాటు అటూ ప్రేక్ష‌కుల‌ను కూడా తీవ్ర నిరాశ‌కు గురి చేశాయి. దీంతో న‌రేష్ వ‌ర్సెస్ చైతు పోరాటం గెలుపు కోసం కాకుండా ఎవ‌రి సినిమా పెద్ద ప్లాప్ అవుతుంద‌నే విష‌యంలో పోటీప‌డేలా ఉన్నారన్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

 

‘ యుద్ధం శ‌ర‌ణం ‘ వ‌ర్సెస్ ‘ మేడ‌మీద అబ్బాయి ‘ …విన్న‌ర్ ఎవ‌రంటే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts