మెగాస్టార్ బోయపాటి :బాక్సాఫీస్ షేకే

మెగాస్టార్ ప్రస్తుతం తన 150వ చిత్రంలో నటించడంలో బిజీగా ఉండగానే అభిమానులు 151 వ సినిమాగురించి ఆలోచనలు మొదలుపెట్టేశారు.దానికి తగ్గట్టే రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికయితే చిరంజీవి కూడా 151వ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వరుస చిత్రాలను చేయడానికి సిద్ధవౌతున్నారు.

మొన్నామధ్య దాసరి నిర్మాతగా చిరు 151 వ సినిమా వుండబొంతోందని వార్త హల్చల్ చేసింది.తాజాగా మాస్ సెన్సేషన్ డైరెక్టర్,బాలకృష్ణతో సింహ, లెజెండ్ వంటి చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను తయారుచేస్తున్న ఓ కథలో మెగాస్టార్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి బాలకృష్ణతో చేసిన ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాలు చిరంజీవితోనే చేయాలట. కానీ చిరంజీవికి కుదరక ఆ సినిమాలు చేయలేదని, ఓ సందర్భంలో చిరంజీవే చెప్పడం తాజా బోయపాటి సినిమా చిరు తోనే ఉండబోతోందనే వాదనకి బలాన్ని చేకూరుస్తోంది.కాకపోతే ఈ సినిమా దాసరి నారాయణ రావు నిర్మాణం లోనా లేక వేరే ఏదయినా సంస్థతోనా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

మెగా హీరో అల్లు అర్జున్తో తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 70 కోట్లకి పైగా వసూళ్లు సాధించి మంచి ఊపుమీదున్న బోయపాటికి మెగా   మాస్ తోడైతే ఇక కలెక్షన్స్ సునామీనే అనడంలో ఎటువంటి సందేహం లేదు.