ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. తొలుత ఏక‌గ్రీవం చేయాల‌ని బీజ‌పీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు సైతం అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో పోటీ అనివార్య‌మైపోయింది. ద‌ళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా మ‌తిపోయింది. ఇంత‌లోనే తేరుకుని, ఆయ‌నకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌ని, కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ క్ర‌మంలోనే మాజీ ఉప ప్ర‌ధాని జ‌గ్జీవ‌న్‌రామ్ కుమార్తె, మాజీ స్పీక‌ర్, విద్యావంతురాలు, సౌమ్యురాలు అయిన మీరా కుమార్‌ను యూపీఏ కూట‌మి బ‌రిలోకి దింపింది. ఇప్పుడు ఈ పోటీ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏకే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక‌, ఏపీ విప‌క్షం కూడా రామ్‌నాథ్‌కే జై కొట్టింది. అయితే, ఇక తెలంగాణ‌లో ఒకింత బ‌లంగా ఉన్న అస‌దుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం.. మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతోంది.

నిజానికి ఈ పార్టీ యూపీఏ కూట‌మిలోదే. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ నిల‌బెట్టిన మీరా కుమార్‌కు మ‌ద్ద‌తివ్వ‌డంలోను అలాగ‌ని , బీజేపీ నిల‌బెట్టిన రామ్‌నాథ్‌కు మ‌ద్ద‌తివ్వాలో తెలియ‌న నానా తిప్ప‌లు ప‌డుతోంది. ముస్లింల‌కు బీజేపీ పూర్తి యాంటీ దీంతో ఎట్టి ప‌రిస్థితి లోనూ రామ్‌నాథ్‌కు ఎంఐఎం స‌పోర్ట్ చేయ‌లేదు.

ఇటు కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేస్తే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో పాటు కేంద్రంలో బీజేపీకి బాగా టార్గెట్ అవుతామ‌ని అస‌దుద్దీన్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఈ ఈ పార్టీ ప‌రిస్థితి ముందు నుయ్యి వెన‌క గొయ్యి అందుకే దూరంగా ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.