మియాపూర్ కుంభ‌కోణం: బ్రోక‌ర్‌గా మారిన ద‌మ్మున్న మీడియా ఎండీ

తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభ‌కోణం కేసు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ప‌ల్లెత్తు మాట అనేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు సాహ‌సించ‌ని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభ‌కోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయ‌కుల పేర్లు ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చాయో అది అక్క‌డ నిద్రాణంగా ఉన్న ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద వ‌రంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుప‌డుతున్నాయి.

ఈ ఇష్యూలో టీఆర్ఎస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావుతో పాటు ఆయ‌న కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మిపై ఈ భూములు వీరి పేర్ల‌తో రిజిస్ట‌ర్ అయిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కేకేతో పాటు టీఆర్ఎస్‌ను ఏకేసేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధం దొరికిన‌ట్ల‌య్యింది. ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ‌లో మిగిలిన ప్ర‌తిప‌క్షాల కన్నా రేవంత్‌రెడ్డే దూకుడుగా ఉన్నారు. ఆయ‌న టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, కేసీఆర్‌ను ఏకి ప‌డేస్తున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలుగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ కంటే కూడా రేవంత్ దూకుడుగా ముందుకు వెళుతూ ఈ కుంభ‌కోణాన్ని ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే టార్గెట్ పెట్టుకున్నారు. ఇది బ‌య‌ట‌కు వ‌స్తే చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌ల గుట్టు ర‌ట్టు అయ్యే ప్ర‌మాదం ఉండ‌డంతో రేవంత్‌ను సైలెంట్ చేసేందుకు ఓ ప్ర‌ధాన పత్రిక ఎండీ రంగంలోకి దిగి మ‌ధ్య‌వ‌ర్తిగా రాయ భేరం సాగించిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌కు యాంటీగా ఉన్న స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక అధినేత ఇప్పుడు కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌ర్కార్‌కు బాగా బాజా ఊదేస్తున్నారు. ఇటీవ‌ల కేసీఆర్ ఆయ‌న‌కు భారీగా మేళ్లు చేకూరుస్తాన‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్టు టాక్‌. ఈ ఇష్యూలో రేవంత్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఉన్నార‌ని, వారి వివ‌రాలు కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెపుతుండ‌డంతో రేవంత్‌ను సైలెంట్ చేసేందుకు స‌ద‌రు ద‌మ్మున్న మీడియాధినేత టీఆర్ఎస్‌కు అనుకూలంగా

బ్రోక‌ర్ అవ‌తారం ఎత్తి రేవంత్‌తో మాట్లాడార‌ని తెలుస్తోంది.

అయితే గ‌తంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌, టీఆర్ఎస్ స‌ర్కార్ త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డంతో పాటు ఎలా ఇరికించింది తాను మ‌ర్చిపోలేద‌ని…ఈ విష‌యాన్ని తాను వ‌దిలిపెట్టేది లేద‌ని రేవంత్ ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ని తెలుస్తోంది. ఇక మియాపూర్ కుంభ‌కోణం ఇష్యూకు సంబంధించి రేవంత్ వ‌ద్ద చాలా ఆధారాలు ఉన్నాయ‌ని, అవి బ‌య‌ట‌కు వ‌స్తే కేసీఆర్ స‌ర్కార్ మ‌రిన్ని ఇరుకుల్లో ప‌డ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇంత‌కు స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక ఎండీ ఎవ‌రో ఈ పాటికే మీకు క్లీయ‌ర్‌గా అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌.