పైసా ఖ‌ర్చేలేదు.. మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడ‌న్న‌మాట‌!!

అందితే జుట్టు.. అంద‌క‌పోతే.. కాళ్లు ప‌ట్టుకోవాలి! ఇది ఓల్డ్ సామెత‌. అయితే, ఇది మ‌న దేశాన్నేలుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అక్ష‌రాలా స‌రిపోతుంద‌ని అంటున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. త‌న‌కు అవ‌స‌ర‌మైన వారితో ఎలా ప‌నిచేయించుకోవాలో..? త‌న అవ‌స‌రం వ‌స్తే.. ఎలా త‌ప్పించుకోవాలో? మోడీకి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దంటే న‌మ్మ‌లేరు. కానీ, పాలిటిక్స్‌లో ఆ మాత్రం జిమ్మిక్కులు చేయ‌క‌పోతే ఎలా అనేవారూ ఉన్నారు. ఇక‌, విష‌యానికి వ‌స్తే.. దేశం మొత్తంమీద ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి, మోడీకి ఉన్న సాన్నిహిత్య‌మే వేరు!

అయితే, ఇది వ‌న్ సైడేనండోయ్‌!! అంటే.. మోడీ త‌న‌కు అవ‌స‌ర‌మైతే.. బాబుపై ఎక్క‌డా లేని ప్రేమ కురిపించేసి… ఆ ప‌ని అయ్యే వ‌ర‌కు నిద్ర‌పోరు. అదే స‌మ‌యంలో బాబుకి ఏదైనా ప‌ని ప‌డితే.. మాత్రం. . మౌనాన్ని ఆశ్ర‌యించ‌కుండా ఉండ‌లేరు. ప్చ్‌! పాపం బాబు.! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చంద్ర‌బాబు కాళ్ల‌కున్న చెప్పుల‌రిగేలా ఢిల్లీ చుట్టూ తిరిగారు. అయినా మోడీ ఆయ‌న‌ను పెద్దగా ప‌ట్టించుకోలేదు.

కానీ, మోడీ మాత్రం త‌న‌కు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే.. ఒక్క ఫోన్ కాల్‌తో బాబును బుట్ట‌లో వేసేసుకుంటున్నారు. విభ‌జ‌న‌కు ముందైనా.. ఇప్పుడైనా మోడీ.. బాబును వాడేసుకుంటున్న తీరు ఆస‌క్తిగా మారింది. విభ‌జ‌న‌కు ముందు తెలంగాణ‌లో జ‌ర‌గిన ఓ స‌భ‌లో వేదిక‌పై త‌న‌కు దూరంగా కూర్చుంటున్న బాబును చేతులు ప‌ట్టుకుని చిన్న‌పిల్లాడిని లాగిన‌ట్టు లాగి మ‌రీ త‌న ప‌క్క‌న కూర్చోబెట్టుకున్నారు మోడీ. కానీ, ప్ర‌త్యేక హోదా, నిధులు వంటి రాష్ట్ర స‌మ‌స్య‌లు మాట్టాడాల్సి వ‌స్తే.. మాత్రం బాబును అంత దూరం పెట్టేశారు.

ఇప్పుడు తాజాగా మ‌రోసారి బాబుతో మోడీకి అవ‌స‌రం ఏర్ప‌డింది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థి కోవింద్‌కు బాబు మ‌ద్ద‌తు అత్యంత కీల‌కం. అందుకే బాబును కాకా ప‌ట్టేందుకు పైసా ఖ‌ర్చులేని ప‌నికి శ్రీకారం చుట్టారు మోడీ. ఓ సెట్ నామినేష‌న్ ప‌త్రాల‌పై బాబు సంత‌కం చేసేలా ప్లాన్ చేశారు. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోయిన బాబు.. జీ హుజూర్ అంటూ ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు.

అయితే, ఈ సంత‌కం మాటున మోడీ.. త‌న మాట లెక్క‌చేయ‌ని బెంగాల్ సీఎం మ‌మ‌త‌ను బాబుతో ఒప్పించేలా ప్లాన్ చేసుకున్నారు. గతంలోనూ నోట్ల ర‌ద్దు పై తీవ్ర ఆందోళ‌న రేగిన‌ప్పుడు సీఎంల క‌మిటీ వేసి.. దానిని చంద్ర‌బాబుని చైర్మ‌న్‌గా వేశారు. ఇక్క‌డా పైసా ఖ‌ర్చేలేదు. సో.. ఇలా మోడీ బాబు ను తెగ వాడేస్తున్నాడ‌న్న‌మాట‌!!