అఖిల్‌పై ఆంధ్రా ఫ్యాన్స్ గ‌రం గ‌రం

December 3, 2016 at 4:59 am
akhil

అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్‌పై ఏపీ ఫ్యాన్స్ గ‌రం గ‌రంగా ఉన్నారు!  అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్‌గా స్టేట్ మెంట్ల‌తో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట ప‌క్క‌న పెడితే.. అక్కినేని అభిమానుల‌కే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్‌పై మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రిగిందో చూద్దామా?!  ఓ కార్య‌క్ర‌మంపై అఖిల్ విశాఖప‌ట్నం వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు మీడియా మిత్రులు అఖిల్‌తో చాట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా టాలీవుడ్‌.. ఏపీకి ఎప్పుడు త‌ర‌లివ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. దీనికి ఉన్న‌ది ఉన్న‌ట్టు లేదా లౌక్యంగా అయినా స‌మాధానం చెప్పి.. ఎవ‌రి మ‌నోభావాలూ దెబ్బ‌తినకుండా చూడాల్సిన అఖిల్‌.. నోటికి వ‌చ్చిన‌ట్టు స‌మాధానం చెప్పాడు. టాలీవుడ్‌.. ఏపీకి షిప్ట్ అయ్యే ప‌నికాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. అంతేకాదు, ఏపీకి చెందిన టాలీవుడ్ స్టార్స్ ఎవ‌రూ హైద‌రాబాద్‌(తెలంగాణ‌)ను విడిచి పెట్టి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని కూడా చెప్పాడు. అంత‌టితో ఆగ‌ని ఈ సిసింద్రీ.. అస‌లు విశాఖ‌లో ఫిలిం స్టూడియోలు నిర్మిస్తే.. ఈగ‌లు తోలుకోవ‌డ‌మే అన్న‌ట్టు మాట్లాడాడు.

ఇప్పుడు ఈ కామెంట్ల‌పైనే ఏపీ అక్కినేని ఫ్యాన్స్ ర‌గిలిపోతున్నారు. ఒక ప‌క్క ఏపీలో స్టూడియోలు నిర్మిస్తే ఇక్క‌డ భారీగా బెనిఫిట్స్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ చెపుతోంది. విశాఖ‌ను టాలీవుడ్‌కు సెంట‌ర్‌గా చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. వాస్త‌వానికి టాలీవుడ్‌కు ఏపీ నుంచే 65 శాతం ఆదాయం వ‌స్తోంది. అఖిల్ అంత అభిమానం కురిపించిన తెలంగాణ ప్రేక్ష‌కుల నుంచి 35 శాతం ఆదాయం సినిమాల‌కు వ‌స్తోంది.

మ‌రి ఈ విష‌యం మ‌న సిసింద్రీకి తెలుసో?  తెలీదో?  తెలియ‌క‌పోతే.. వాళ్ల నాన్న‌ని అడిగినా షేరింగ్ క్లాస్ ఇస్తాడు. సినిమాకు ఏపీ, తెలంగాణ రెండూ ముఖ్య‌మే. అయ‌తే ఇలాంటి విష‌యాల్లో హీరోలు ఆచితూచి స్పందించాలి. కానీ అక్కినేసి సిసింద్రీ అఖిల్ ఇలా కాంట్ర‌వ‌ర్సీగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు.

 

అఖిల్‌పై ఆంధ్రా ఫ్యాన్స్ గ‌రం గ‌రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share