అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్

February 27, 2017 at 5:31 am
121

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున‌కు త‌న సినిమా కేరీర్‌తో పాటు ఇత‌ర‌త్రా విష‌యాల్లో ఏ చిన్న విష‌యం మీడియాలో వ‌చ్చినా వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వ‌డ‌మో లేదా సోష‌ల్ మీడియాలో స్పందించ‌డ‌మో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విష‌యాన్ని కూడా దాచ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు.అతెందుకు చైతు-స‌మంత ప్రేమించుకున్న విష‌యాన్ని మీడియా వాళ్లు ప్ర‌స్తావిస్తే  అవున‌ని ఓపెన్‌గానే చెప్పేశాడు.

అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాట‌ర్ క్యాన్సిల్ వార్త‌లు మీడియాలో  ప్ర‌కంప‌న‌లు రేపుతున్నా అస్స‌లు స్ప‌దించ‌డం లేదు స‌రిక‌దా..?  మీడియాకే క‌న‌ప‌డ‌డం లేదు. అఖిల్-శ్రియభూపాల్ పెళ్లికి సంబంధించి రోజుకో యాంగిల్ లో స్టోరీలు వస్తున్నప్పటికీ నాగ్ నోరు మెద‌ప‌డం లేదు. దీంతో ఈ వార్త‌లు నిజ‌మే అని మ‌ళ్లీ వార్త‌లు రాసేస్తున్నారు.

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌న్న ప్ర‌క‌ట‌న వ‌చ్చినందుకే నాగ్ వెంట‌నే ఖండించాడు.అలాంటిది అఖిల్ – శ్రియా పెళ్లి విష‌యంలో వార్త‌లు బ్యాన‌ర్ క‌థ‌నాలుగా వస్తున్నా..వారం రోజులుగా మీడియాలో ట్రెండ్ అవుతున్నా అస్స‌లు స్ప‌దించ‌డం లేదు. నాగ్ సైలెంట్ వెన‌క ప‌రిస్థితులు మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తాయ‌ని… అఖిల్‌-శ్రియాలు క‌లుస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట‌.

వీరిద్ద‌రిని క‌లిపేందుకు ఇటు నాగ్‌, అటు జీవీకే ఫ్యామిలీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అవి ఫ‌లిస్తాయ‌నే న‌మ్మ‌కంతో నాగ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి నాగ్ న‌మ్మ‌కం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share